Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 8:55 pm IST

Menu &Sections

Search

ఎలక్ట్రానిక్‌ హబ్‌గా ఏపీ..

ఎలక్ట్రానిక్‌ హబ్‌గా ఏపీ..
ఎలక్ట్రానిక్‌ హబ్‌గా ఏపీ..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్‌ హబ్‌ గా రూపుదిదేందుకు అవసరమైన  అన్ని చర్యలూ తీసుకుంటున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఎలక్ట్రానిక్‌ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ సిద్ధంగా ఉందని సీఎం వైయస్‌ జగన్‌ తెలిపారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ఫాక్సికన్‌ ఇండియా ఎండీ జోష్‌ ఫాల్గర్‌ కలిశారు. ఈ సందర్భంగా సంస్థ కార్యకలాపాలను ముఖ్యమంత్రికి  ఫాల్గర్ వివరించారు.
 


నెల్లూరు జిల్లాలోని శ్రీ సిటీలో ఉన్నతమ కంపెనీ ద్వారా దాదాపు 15 వేల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. వారందరికి వృత్తిపరమైన శిక్షణ కూడా ఇచ్చామని చెప్పారు. అదే విధంగా కంపెనీ ఉత్పాదక సామర్థ్య శక్తిని  కూడా పెంచేందుకు తగు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకు 35 లక్షల సెల్‌ఫోన్లు విక్రయిస్తున్నట్లు ఫాక్సికన్‌ ఇండియా ఎండీ తెలిపారు.ఎలక్ట్రానిక్‌ రంగంలో కొత్త అవకాశాలు అంది పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రితో జరిగిన భేటీలో ఫాక్సికన్‌ ఇండియా ఎండీ భవిష్యత్ కార్యాచరణనను వివరించారు. ఈ క్రమంలో కంపెనీ విస్తరణపై సీఎంకు సంస్థ ఎండీ వివరాలు తెలిపారు.  





ఈ  సందర్బంగా సీఎం వైయస్‌ జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో మరింత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ఉద్దేశమన్నారు.ఆ దిశలో ఫాక్సికన్‌ కంపెనీ కూడా ముందుడుగు వేయాలని సీఎం జగన్  ఆకాంక్షించారు. అంతేకాకుండా పెట్టుబడులకు రాష్ట్రం అన్ని విధాల అనుకూల ప్రాంతమని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. ఉత్తమ నైపుణ్యమున్న మానవ వనరులను తయారు చేయడానికి అత్యుత్తమ ప్రమాణాలతో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.



Chief Minister YS Jaganmohan Reddy said all measures are being taken to make the state an electronic hub.
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సీఎం జగన్ పై జనసేనాని ఘాటైన విమర్శ
దీపావళి నోములు ఇలా...
23 ,24 వ తేదీల్లో భారీ వర్షాలు
పేదవాడిని చదివిద్దాం..జగన్ ఆకాంక్షను నెరవేరుద్దాం
ఇటు మునిసిపల్ ఎన్నికలు..అటు ఆర్టీసీ సమ్మె: సమాలోచనల్లో కేసీఆర్‌
లోకేష్ ఓ చెల్లని చెక్కు లాంటోడు..
పోలవరంపై అజమాషికి కేంద్ర ఆసక్తి..
గిరిజన ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి మిషన్..
23న దక్షిణకోస్తాంధ్ర మీద అల్పపీడనం..
ఏపీలో కాషాయం దండులోకి పచ్చ తమ్ముళ్లు.
అసలే నష్టాలు.. సమ్మెతో రోజుకి రూ.10 కోట్లు లాస్
చిలికి చిలికి గాలివాన చందంగా ఆర్టీసీ సమ్మె
చట్టం ముందు అందరూ సమానులే.. జగన్‌ స్పష్టీకరణ
స్ఫూర్తిదాయకంగా పోలీసు అమర వీరుల దినోత్సవం
ఆహార మార్పులతో మధుమేహాన్ని తగ్గించుకోవచ్చు...
ఆ రెండు రాష్ట్రాల్లో బిజెపి చేతికి అధికార పగ్గాలు
ఏపీలో కలకలం రేపుతున్న నియామకాల జీఓ
సమ్మెపై గవర్నర్ జోక్యాన్ని కోరిన ఆర్టీసీ జేఏసీ..
సమ్మె కాలమిది..22 న బ్యాంకు ఉద్యోగుల సమ్మె
ఆన్‌లైన్‌లో స్వ‌యంగా ద‌స్తావేజుల త‌యారీపై అవ‌గాహ‌న
నిరుద్యోగులకు తీపికబురు..
ఉనికి కోసమే బిజెపిపైన విమర్శలు..
ఏపీలో పేదలకు జగన్ ఉగాది కానుక..
ఆర్టీసీ సమ్మె: ముమ్మరంగా బంద్ నిరసనలు.. అరెస్టుల పర్వం
హుజుర్ నగర్ ప్రచారపర్వానికి చెక్..!
బంద్ తో కదలని రథచక్రాలు..ప్రత్యమాన్య చర్యల్లో సర్కారు..
రాష్ట్ర బంద్‌కు రెవెన్యూ సంఘాల సంఘీభావం
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.