మనదేశంలో కాలం గడుస్తోంది... నాగరికత సంతరించుకుంటుంది కానీ చాలా చోట్ల అంటరానితనం అన్నది ఇప్పటికీ చెరిగిపోని ముద్రలా మిగిలిపోయింది. ఇక్కడ బ్రతికేది మనుష్యులు మాత్రమే కానీ మతాలు, కులాలు కాదని కొంత మంది అప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు. అందుకు ఉదాహరణే మహా నగరమైన బెంగళూరు సమీపంలో ఉన్న ఒక గ్రామానికి చెందిన ప్రజలు. బిజెపి పార్టీకి చెందిన నారాయణస్వామి గొల్లరహట్టి గ్రామం చెందబడిన పార్లమెంట్ సెగ్మెంట్ కు ఎంపీ. అయితే ఆ గ్రామంలోని ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు అతను అక్కడకి చేరుకోగా... అతని రాకను ఆ గ్రామ ప్రజలు నిరాకరించారు.

తమ గ్రామానికి కొన్ని పద్ధతులు మరియు కట్టుబాట్లు ఉన్నాయని… ఇక్కడ జరిగిన సంఘటనలకు ఒక పెద్ద చరిత్రే ఉంది కాబట్టి ఇక్కడి ప్రజలు ఒక దళితుడిని లోనికి అడుగుపెట్టనీయరని అని ఒక గ్రామస్థుడు తెలిపాడు. యాదవ కులానికి చెందిన వారు ఎక్కువగా ఉండే ఈ గ్రామంలో అనాదిగా ఇదే పద్ధతి కొనసాగుతూ వస్తుందట. భారతీయ జనతా పార్టీకి చెందిన చిత్రదుర్గ ఎంపీ అయిన నారాయణస్వామి ఆ గ్రామంలో తాగునీటి సమస్యలు ఉన్నాయని తెలిసి అక్కడి వారితో వాటి గురించి చర్చించి తగిన చర్యలు తీసుకుందామని వెళ్లగా వారు అతనిని లోనికి రానివ్వకుండా ఊరి బయటే ఉంచారు.

మంగళవారం చోటు చేసుకున్న ఈ అమానుషమైన ఘటన పైన నారాయణస్వామి మాట్లాడుతూ తాను ఊరిలోకి అనుకుంటే బలవంతంగానే వెళ్లవచ్చని కానీ ఇప్పుడే చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి యొక్క తీవ్రతను పెంచడం ఇష్టం లేక ఆగిపోయినట్లు తెలిపాడు. ఈ సంఘటన ఆధారంగా మన దేశంలో ఇంకా అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యత ఏమిటో తనకు బాగా తెలిసిందని.... రాజ్యాంగబద్ధంగా మానవాళి అంతా సమానమే అని హితమును క్రొత్త పద్ధతుల ద్వారా బోధించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: