తెలంగాణ స‌ర్కారు ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ ప‌థ‌కాలు ఏపీలోను అమ‌లు చేసేందుకు ప్ర‌స్తుత స‌ర్కారు స‌న్న‌హాలు చేస్తుంది. ఇప్ప‌టికే అనేక ప‌థ‌కాల‌ను తెలంగాణ స‌ర్కారు విజ‌య‌వంతంగా అమ‌లు చేస్తూ ప్ర‌జ‌ల చేత ప్ర‌శంస‌లు అందుకుంటుంది. అదే విధంగా తెలంగాణ‌లో అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను అటు కేంద్ర ప్ర‌భుత్వం ఇటు ప‌లు రాష్ట్ర ప్రభుత్వాలు ప్ర‌శంసిస్తూనే అనుక‌రిస్తున్నాయి. అయితే ఏపీ స‌ర్కారు తెలంగాణ‌లో అమ‌ల‌వుతున్న కొన్ని ముఖ్య‌మైన సంక్షేమ ప‌థ‌కాల‌ను అమలు చేసేందుకు ఎంతో దైర్యంతో ముందుకు పోతుంది.


ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా సంక్షేమం కోసం మంచి ప‌థ‌కాలు ఏవైనా సరే ప్ర‌వేశ‌పెట్టాల‌నే కృత‌నిశ్చ‌యంతో ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన కంటివెలుగు ప‌థ‌కాన్ని ఏపీలో అమ‌లు చేయాల‌ని సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యించారు. సీఎం జ‌గ‌న్ మంగ‌ళ‌వారం అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌మీక్ష స‌మావేశంలో ప‌లు నిర్ణ‌యాలు తీసుకుని అధికారుల‌కు దిశానిర్దేశం చేసారు సీఎం జ‌గ‌న్‌.


అందులో ప్ర‌ధానంగా కంటివెలుగు, డ్రైవ‌ర్ల‌కు రూ.10వేల సాయం, రాయ‌ల‌సీమ‌లో కురువ‌బోయే వ‌ర్షాల‌కు ఎలాంటి న‌ష్టం రాకుండా చూసుకోవ‌డం, త‌దిత‌ర ముఖ్య‌మైన నిర్ణ‌యాలు తీసుకుని అధికారుల‌కు సూచ‌న‌లు చేశారు. ఏపీ సీఎం జ‌గ‌న్ చేసిన కొన్ని నిర్ణ‌యాలు ఇలా ఉన్నాయి..


- రాయ‌ల‌సీమ ప్రాంతాల్లో కురుస్తున్న వ‌ర్షాల‌పై ముఖ్య‌మంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు.
కర్నూలు, కడప, ప్రకాశం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయ‌న్న స‌మాచారం వ‌స్తోంద‌ని, అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు.


- సొంతంగా ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్‌లు నడుపుకుంటున్నవారికి ఏడాదికి రూ.10వేల పథకంపై అధికారులతో ముఖ్యమంత్రి శ్రీ‌ వైయస్ జగన్ సమీక్షించారు. దరఖాస్తులు తీసుకోవడం, వాటికి తనిఖీలు, ఆమోదం పై ఉన్నతాధికారులతో చర్చించారు.


- స్పందన కార్యక్రమం పై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. స్పందన ద్వారా అందే వినతుల పరిష్కారంలో నాణ్యతకోసం ఎమ్మార్వోలు, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లకు వర్క్‌షాపులు ఏర్పాటు చేయాలని, మరింత మానవీయ దృక్పథంతో స్పందన వినతులకు పరిష్కారం చూపాలని అధికారులను కోరారు.


- రూ.560 కోట్లతో కంటి వెలుగు కార్యక్రమం చేపడుతున్నామని ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు. స్పంద‌న కార్య‌క్ర‌మంలో సీఎం మాట్లాడుతూ స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్‌ శస్త్రచికిత్స, ఇతర కార్యక్రమాలన్నీ వైయ‌స్ఆర్‌ కంటి వెలుగు కింద ప్ర‌భుత్వం చేప‌డుతుంద‌న్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: