ఆయ‌న కాంగ్రెస్‌కు సీనియ‌ర్ నేత‌. మాజీ సీఎంగా, కేంద్ర మాజీ మంత్రిగా, ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీగా ప‌నిచేసిన నేత‌.. నిత్యం సోష‌ల్ మీడియాలో చురుకుగా ఉంటాడు. సోష‌ల్ మీడియాలో వివాద‌స్ప‌ద కామెంట్లు చేస్తూ రాజ‌కీయ దుమారం రేపుతాడు. ఇత‌డు ఇత‌ర పార్టీల‌ను ఇరుకున పెట్ట‌డంలో దిట్ట‌గానే కాంగ్రెస్ అభివ‌ర్ణిస్తుంది. అందుకే ఈనేత సేవ‌ల‌ను ఇంకా పార్టీ కొన‌సాగిస్తూనే ఉంది. ఇంత‌కు ఈ నేత ఎవ‌రో చెప్ప‌లేదు క‌దూ.. డిగ్గిరాజా ఉర‌ఫ్ దిగ్విజ‌య్‌సింగ్‌. ఈనేత కాంగ్రెస్ పార్టీకి ప్ర‌ధాన వ‌క్త‌ల్లో ఒక‌రుగా నిలిచారు. అయితే ఇప్పుడు చేసిన వివాదస్ప‌ద వ్యాఖ్యాలు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారాయి.


దేశంలో అత్యాచారాలు పెర‌గ‌డానికి కాషాయం ధ‌రించిన వారితోనేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించాడు.  ప్రస్తుతం కాషాయ వస్త్రాలు ధరించిన వ్యక్తులు అత్యాచారాలకు పాల్పడుతున్నారని దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. భోపాల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. లైంగికదాడులు ఆలయాల్లోపలే జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. సనాతన్ ధర్మాన్ని కాషాయ దుస్తులు ధరించిన కొంతమంది వ్యక్తులు నాశనం చేస్తున్నారు. ఇది మన మతమేనా..? అని దిగ్విజయ్ ప్రశ్నించారు. మతం పేరుతో ఇలాంటి కార్యకలాపాలకు ఒడిగట్టే వారిని దేవుడు కూడా క్షమించడని అన్నారు.


భార‌త దేశంలో ఇప్పుడు స‌నాత‌న ఉగ్ర‌వాదం పెరిగిపోతుంద‌నే వాద‌న బ‌లంగా గ‌త కొంత కాలంగా వినిపిస్తుంది. స‌నాన‌త ఉగ్ర‌వాదం అంటే దేవుడి పేరుతో, భ‌క్తి పేరుతో మోసాలు చేయ‌డం, అత్యాచారాలు, హ‌త్య‌లు, దోపిడీలు, దాడులు, దౌర్జ‌న్యాలు చేయ‌డం వంటివని ఎంద‌రో చెపుతున్నారు. స‌నాత‌న ఉగ్ర‌వాదం ముసుగులో కాషాయం ధ‌రించిన వారు పెట్రేగిపోతున్నార‌ని డిగ్గిరాజా అన‌డం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది. ఇప్పుడు డిగ్గిరాజా వ్యాఖ్యాల‌పై కాషాయం ధ‌రించే స్వాములు, కాషాయం ధ‌రించే పార్టీల నేత‌లు ఎలా స్పందిస్తారో.. ఈ వ్యాఖ్యాలు ఎటువైపు దారి తీస్తాయో చూడాలి మ‌రి.



మరింత సమాచారం తెలుసుకోండి: