ట్రంప్ కొన్ని విషయాల్లో వెనకడుగు వేస్తున్నారు.  గతంలో ఉండే అధ్యక్షులు యుద్దానికి రెడీగా ఉండేవాళ్ళు.  యుద్ధం చేయడానికి రమ్మని చెప్పగానే ఏ మాత్రం ఆలోచించకుండా దూకేసేవారు.  అలా యుద్దాలు చేసి చేసి అమెరికా ఆర్ధిక వ్యవస్థ దారుణంగా మారిపోయింది.  ఒకప్పుడు అమెరికా ఆర్ధిక వ్యవస్థ బలమైనదిగా ఉంటె.. ఇప్పుడు దారుణంగా పడిపోతుంది.  క్రమంగా ఆర్ధిక వ్యవస్థ కుదేలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.  ఈ క్రమంలో ట్రంప్ అధ్యక్షుడు అయ్యాడు.  


స్వతహాగా ట్రంప్ రియల్ ఎస్టేట్ వ్యాపారి.  బిజినెస్ మెన్.  ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారుగాని యుద్ధం చేయడానికి మనసు సహకరించదు.  ట్రంప్ విషయం కూడా అంతే.  ట్రంప్ వచ్చే సరికి చాలావరకు ఆర్ధిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడింది. దాన్ని చక్కదిద్దే ప్రయత్నంలో ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు.  


ఇది నిజంగా ఇబ్బందికరమైన అంశం అని చెప్పాలి.   ఇలాంటి ఇబ్బందులతోనే ఏదో నెట్టుకొస్తున్నారు.  ఈ సమయంలో గల్ఫ్ లో రగడ మొదలైంది.  హుతి ఉద్యమకారులు సౌదీ అరేబియాకు చెందిన అరాంకో చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడులు చేశారు.  ఈ దాడుల్లో చమురు కర్మాగారం దెబ్బతిన్నది.  చమురు ఉత్పత్తి ఆగిపోయింది.  రెండు వారాల్లోగా మాములు పరిస్థితి వస్తుంది అనుకున్నా అది జరిగేలా లేదు.  హుతీ తిరుగుబాటుదారులు మాత్రం ఇంకా దాడులు చేస్తామని చెప్తున్నారు.  


దీనిపై సౌదీ అరేబియా కోపంగా ఉన్నది.  యెమన్ లోని హుతి తిరుగుబాటు దారులకు ఇరాన్ సహాయం చేస్తోందని, అందుకే వారు దాడి చేస్తున్నారని అంటోంది.  ఇరాన్ మాత్రం దీనిని ఖండించింది.  ఈ విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.  అమెరికా మొన్నటి వరకు ఈ విషయంపై సీరియస్ గా ఉన్నా.. ఇప్పుడు దీనిపై సైలెంట్ గా ఉంటోంది.  సౌదీకి సహాయం చేస్తాం కాకపోతే.. యుద్ధం చేయమని స్పష్టం చేసింది.  ఇది సౌదీ పై జరిగిన దాడి అని అమెరికాపై జరిగింది కాదని ట్రంప్ చెప్పడం విశేషం.  యుద్దాలు చేయడం ఇష్టం లేదని ఇప్పటికే పలుమార్లు వైట్ హౌస్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: