మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కచ్చితంగా ప్రభుత్వ హత్యేనంటున్నారు మాజీ సీఎం చంద్రబాబు.. ఆయన కోడెల ఆత్మహత్య తర్వాత సుదీర్ఘంగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు.. ప్రభుత్వమే తప్పుడు కేసులు పెట్టి కోడెల ఆత్మహత్యకు దారి తీసేలా చేసిందని విమర్శిస్తున్నారు. మంగళవారం ఉదయమే.. కోడెల మృతదేహం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఉండగానే సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టి జగన్ తీరుపై విమర్శించారు.


ఆ తర్వాత రాత్రి మరోసారి సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టి జగన్ సర్కారు తీరుపై మండిపడ్డారు. కానీ ప్రెస్ మీట్ లో ఓ విలేఖరి అడిగిన ప్రశ్న చంద్రబాబును తెగ ఇబ్బంది పెట్టేసింది... ఈ ప్రశ్న అడగటానికి మీకు సిగ్గుండాలి.. ఈ ప్రశ్న ఎలా అడుగుతారు.. అంటూ విలేఖరిపై చంద్రబాబు రెచ్చిపోయారు. ఇంతకీ ఆ విలేఖరి అడిగిందేమిటంటే.. మీరు కోడెల అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎందుకు పరామర్శించలేదు.. అని.


మేం అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి.. అంతే కానీ..మీరు మమ్మల్ని ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు అన్నట్టుగా చంద్రబాబు రెచ్చిపోయారు. చంద్రబాబు కోపం చూస్తుంటే.. వైసీపీ నేతల విమర్శలు గుర్తుకొస్తున్నాయి. కోడెల మరణానికి కారణం ఆయన కుటుంబ సభ్యులు, చంద్రబాబే కారణమని అంబటి రాంబాబు అన్న మాటలు గుర్తొస్తున్నాయి.


కొద్ది రోజుల క్రితం కోడెల మొదటి సారి ఆత్మహత్య యత్నం చేసినప్పుడు కనీసం పలకరించని చంద్రబాబు ఇప్పుడు మరణించిన తర్వాత శవ రాజకీయం చేస్తున్నారని అంబటి అన్నారు. నిజంగానే చంద్రబాబుకు కోడెల కుటుంబంపై అభిమానం ఉంటే కోడెల కుమారుడు, కుమార్తెలను నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాలకు ఇన్ చార్జీలుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. నేతలను వాడుకుని వదలివేయడం చంద్రబాబుకు అలవాటేనని, కోడెల విషయంలోను అదే చేశాడని, అందువల్లనే కోడెల ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: