ఇప్పుడున్న పరిస్దితుల్లో పాన్ కార్డు అనేది ప్రతి వ్యక్తి అత్యవసరం.ఎటువంట లావాదేవీలకైన పాన్‌కార్డ్ నంబర్‌ను తప్పని సరిగ్గా జతచేయవలసి వస్తుంది.ఇక ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం.పాన్ కార్డు,ఆధార్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా రెండింటినీ అనుసంధానం చేసుకోవాలి.సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని తెలియజేసింది. ఇకపోతే ఐటీఆర్ ఫైలింగ్‌కు ఇప్పుడు ఆధార్ నెంబర్ కూడా తెలియజేయాలి.పాన్ కార్డు లేనివారు ఆధార్ నెంబర్‌తో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయొచ్చు.ఇక మీ వివరాలతో లాగిన్ అవ్వాలంటే పాన్,ఆధార్ ఇంటర్‌ఛేంజబుల్.ఆదాయపు పన్ను శాఖకు చెందిన ఎస్ఎస్‌డీఎల్ వెబ్‌సైట్‌కు వెళ్లండి.లేదా యూటీఐఐటీఎస్ఎల్ పోర్టల్‌కు కూడా వెళ్లొచ్చు.



అందులో లింకింగ్ ఆధార్ ఆప్షన్ ఎంచుకోండి.మరో విండో ఓపెన్ అవుతుంది.ఆధార్ కార్డులోని పేరు,పుట్టిన తేదీ,జెండర్ వంటి వివరాలు ఎంటర్ చేయండి.ఆధార్ నెంబర్,క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లింక్ ఆధార్‌పై క్లిక్ చేయాలి.అప్పుడు రెండూ లింక్ అవుతాయి.యూఐడీపీఏఎన్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి.తర్వాత 567678కు ఎస్ఎంఎస్ పంపాలి.మీరు తప్పకుండా ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్‌తోనే ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది.ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆధార్‌ కార్డుతో పాన్ నెంబర్ లింక్ చేసుకోండి,ఎందుకంటే డెడ్‌లైన్ దగ్గరకు వచ్చేస్తోంది.పాన్‌కార్డ్ వున్న అందరికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది.పాన్-ఆధార్ అనుసంధానం తప్పని సరి.మీరు రెండింటినీ నిర్ణీత గడువులోగా లింక్ చేసుకోకపోతే ఆదాయపు పన్ను శాఖ మీ పాన్ కార్డును పనిచేయకుండా చేసే అవకాశం వుంది..



ఇక ఆధార్ అప్‌డేట్ చేసుకునే ముందు ఈ విషయాలను తప్పని సరిగ్గా గుర్తు పెట్టుకోండి.ఒకవేళ మీ వద్ద రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేకపోయినా.యూఐడీఏఐతో మీ ఫోన్ నెంబర్ రిజిస్టర్డ్ కాకపోయినా అప్పుడు ఆధార్ సెంటర్‌కు వెళ్లి వివరాలు అప్‌డేట్ చేసుకోవాలి.ఆధార్ వివరాలు కరెక్ట్ చేసుకునే సమయంలో.అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్ ను తప్పక మీ వద్ద ఉంచుకోవాలి. దీంతో అప్‌డేట్స్‌ను చెక్ చేస్తూ ఉండొచ్చు.ఆధార్ వివరాల మార్పు సమయంలో అప్లికేషన్‌లో పేరు కరెక్ట్‌గా ఉండేలా చూసుకోండి.ఆధార్ కార్డులో ఇదివరకు ఉన్న పేరును రిపీట్ చేయొద్దు.ఈ ఆధార్‌ను యూఐడీఏఐ వెబ్‌సైట్‌కు వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.దీనికి ముందు వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి.



ఆధార్ కార్డులో పేరులో మార్పు చేసేటప్పుడు ఎలాంటి హోదాలు ఉండకూడదు.కేవలం మీ పేరు మాత్రమే ఉండాలి. వివరాలు అప్‌డేట్ చేయాలంటే కచ్చితంగా దానికి సపోర్ట్‌గా నిలిచే డాక్యుమెంట్లు కూడా కలిగి ఉండాలి.ఈ ఆధార్ వివరాల అప్‌డేట్ సమయంలో ఒకటికి రెండు సార్లు అన్ని కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.పాన్ కార్డు సహా ఇతర కీలక డాక్యుమెంట్లలో పేరు ఎలా ఉందో అలాగే ఆధార్‌ కార్డులో పేరు కూడా కలిగి ఉండటం మంచిది.ఇక అన్ని వివరాలు సరిగ్గా వున్నాయని నిర్ధారణకు వచ్చాక ఈ రెండు ఒకదానితో ఒకటి లింక్ చేయండి ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి.


మరింత సమాచారం తెలుసుకోండి: