తెలుగుదేశం మాజీ అసెంబ్లీ స్పీకర్, కోడెల శివప్రసాద రావు ఈనెల 16 వ తేదీన తన సొంత ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.  గత కొంతకాలంగా ఆయనను కేసులు చుట్టుముడుతున్నాయి.  ఈ కేసులు చుట్టుముట్టిన కారణంగా తీవ్ర మనస్తాపం చెందిన కోడెల ఆత్మహత్య చేసుకున్నట్టుగా సమాచారం.  రాజకీయ ఒత్తిడులు, రాజకీయ అవమానాలే అయన ఆత్మహత్యకు కారణాల లేకుంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉన్నది.  


ఆత్మహత్యకు ముందు అయన ఎవరెవరితో మాట్లాడారు అనే విషయాలు బయటకు రావాల్సి ఉన్నది.  అయితే, కోడెల మరణం తరువాత ఆయన ఫోన్ కనిపించడం లేదు.  ఫోన్ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.  ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే ముందు ఎవరెవరితో మాట్లాడి ఉంటారు.  ఏ విషయంపై మాట్లాడి ఉంటారు అనే విషయాలు కనుగొనడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.  వీలైనంత త్వరగా మొబైల్ ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు.  


కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న రూమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఆ క్షుణ్ణంగా పరిశీలించారు.  అనుమానం  వచ్చిన ప్రతి వస్తువును కలెక్ట్ చేసుకున్నారు.  అయితే, రూమ్ లో ఫోన్ దొరకలేదు.  అయన కోసం దొరికితే.. అందులోని డేటాను బట్టి విషయాలు బయటకు తీసుకురావొచ్చు.  వాట్సాప్ మెసేజ్ ఆధారంగా కొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది.  


దీంతో పాటు మిగతా విషయాలు కూడా కనుగొనడానికి ట్రై చేస్తున్నారు.  కోడెల శివప్రసాద రావు ఆత్మహత్య వెనుక మొబైల్ ఫోన్ కీలకంగా మారనున్నదా అంటే అవుననే అనుకోవచ్చు.  మొబైల్ ఫోన్ ఇప్పటి వరకు దొరక్కపోవడంతో అసలేం జరిగింది అన్నది తెలియడం లేదు.  ఆత్మహత్యకు ముందు అయన ఎవరెవరితో మాట్లాడి ఉంటారు.  ఎవరెవరితో ఎలాంటి సంభాషణలు జరిపారు అనే విషయాలు బయటకు రావాల్సి ఉన్నది.  అవి వస్తేనే అన్ని బయటకు వస్తాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: