ఇటీవలే దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద రాయల్ వశిష్ట బోట్ మునిగిన ప్రమాదంలో 27 మంది సజీవంగా బయటపడగా.. మిగతా వారు జలసమాధి అయ్యారు.  బోటులో 61 మంది ప్రయాణిస్తున్న సంగతి తెలిసిందే.  కచ్చులూరు దగ్గర సుడిగుండాలు ఉండటం.. ప్రవాహవేగం ఎక్కువగా ఉండటంతో ఈ ప్రమాదం జరిగింది.  మునిగిపోయిన బోటు నది అడుగుభాగానానికి చేరుకుంది.  బోటును బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.  


ఎన్డీఆర్ఎఫ్, నేవి, ఉత్తరాఖండ్ డిజాస్టర్ స్పెషల్ టీం ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.  కానీ, ఉపయోగం లేకుండా పోయింది.  బోటు మునిగిన ప్రదేశంలో సుడిగుండాలు ఎక్కువగా ఉన్నాయి.  నీటి అడుగుభాగానికి వెళ్లడం కష్టంగా ఉంటుంది.  నీటి అడుగుభాగానికి వెళ్లే కొద్దీ ప్రవాహ వేగం ఎక్కువగా ఉంటున్నట్టు తెలుస్తోంది.  ప్రవాసం నిశ్చలంగా ఉంటె బోటును పైకి తీసుకురావడం పెద్ద విషయం కాదు.  కానీ, నదిలో నీరు నిశ్చలంగా ఉండకుండా ప్రవహిస్తుంటుంది కాబట్టి మునిగిన బోటును బయటకు తీసుకురావడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు.  


దాదాపు బోటు 350 అడుగుల లోతులో ఉన్నట్టుగా తెలుస్తోంది.  తాళ్లకు కొక్కాలు కట్టి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.  కానీ లాభం లేకపోయింది.  నేవి రంగంలోకి దివి ప్రయత్నం చేసింది.  అందుబాటులో ఉన్న అన్నిరకాల సాంకేతిక పరిజ్ఞానంతో పడవను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.  తమకు 150 అడుగుల లోతువరకు వెళ్లేందుకు అనుమతులు ఉన్నాయి.  


అంతకు మించి లోతుకు వెళ్ళడానికి అనుమతులు లేవు.  ఇప్పటికే బోటు మునిగిపోయి మూడు రోజులు దాటింది.  పడవ నది అడుగుభాగానికి వెళ్లినట్టు తెలుస్తోంది. బయటకు తీయడం చాలా కష్టం అని నేవి తేల్చేసింది.  బోటులో కొన్ని మృతదేహాలు చిక్కుకొని ఉండే అవకాశం ఉండొచ్చు.  ఎందుకంటే.. డెక్ పైన ఉన్న వ్యక్తుల మృతదేహాలు బయటకు వస్తున్నాయి.  డెక్ లోపలలో ఉన్న మృతదేహాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.  బోటును బయటకు తీస్తేనేగాని మిగతావి బయటపడొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: