కోడెల ఆత్మహత్య ఎపిసోడ్ లో చంద్రబాబునాయుడును తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య బాగా ఇరికించేశారు.  రెండు రోజుల క్రితం టిడిపి సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద రావు తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే కోడెల ఆత్మహత్య చేసుకున్నారో  వెంటనే చంద్రబాబు శర రాజకీయాలు మొదలుపెట్టేశారు.

 

 కోడెల మరణానికి ముందు పార్టీలో జరిగిన వ్యవహారాలు నిజానికి  చాలామందికి తెలీవు. ఆమధ్య కోడెలకు గుండెపోటు వచ్చిందని ఆసుపత్రిలో చేరితే నిజమే అనుకున్నారు అందరు. కానీ అప్పుడు కూడా ఆత్మహత్యా ప్రయత్నమే చేశారని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అందుకనే కోడెల ఆత్మహత్య ఘటన అంతగా సంచలనమైంది.

 

అలాంటి కోడెల ఆత్మహత్య వివాదాం తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందో అని చంద్రబాబు టెన్షన్ పడ్డారు. అందుకనే తనను ఎవరూ తప్పు పట్టకుండా ముందుగా తాను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపైనే కాకుండా  వైసిపి నేతల మీద కూడా ఆరోపణలు చేస్తు రెచ్చిపోతున్నారు. ఈ నేపధ్యంలోనే సీనియర్ నేత వర్ల రామయ్య ప్రైవేటు సంభాషణ లీకవ్వటంతో చంద్రబాబు ఇరుకున పడిపోయారు.

 

 అనంతపురంకు చెందిన శ్రీనివాస్ అనే కార్యకర్త వర్లకు ఫోన్ చేసి మాట్లాడిన 7 నిముషాల ఆడియో టేప్ సంచలనంగా మారింది. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణల్లో కోడెల ఆత్మహత్యకు కొడుకు, కూతురే కారణమన్న కార్యకర్త అభిప్రాయంతో వర్ల ఏకీభివించారు. అంతే కాకుండా కోడెల ఆత్మహత్యకు కొడుకు, కూతురే కారణమన్న విషయాన్ని వర్ల మరో సందర్భంలో తానే స్పష్టంగా చెప్పారు.

 

వర్ల చెప్పిన విషయాన్ని విశ్లేషిస్తే కోడెల మరణానికి కొడుకు, కూతురే కారణమన్న విషయం చంద్రబాబుతో సహా పార్టీలోని ప్రతి ఒక్కరికీ తెలుసు. అదే సందర్భంలో కోడెలతో మాట్లాడటం ఇష్టం లేకే చంద్రబాబు దూరంగా పెట్టేసిన విషయం కూడా తెలుసు. అయితే కోడెల మరణాన్ని రాజకీయంగా వాడుకునేందుకు నీచ రాజకీయాలకు చంద్రబాబు అండ్ కో తెరలేపినట్లు స్పష్టంగా అర్ధమైపోతోంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: