బంగారం ధర గత కొన్ని రోజులుగా భారీగా తగ్గుతూ పెరుగుతూ వస్తుంది.ఈ దోబూచులాట ఈరోజు కూడా ఆడింది.అందరు బాధ పడుతున్నారని ఏకంగా 2000 రూపాయిలు తగ్గి పసిడి ప్రియులకు కాస్త ఊపిరిని తేలికచేసింది.దీంతో బంగారం,వెండి ధరల పరుగుకు కాస్త అడ్డుకట్ట పడినట్లైంది.ఎందుకు ఇలా జరుగుతుందటే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం ఇందుకు కారణం.ఎంసీఎక్స్ మార్కెట్‌లో బుధవారం అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు 0.25 శాతం తగ్గుదలతో రూ.37,920 కు క్షీణించింది.ఈ నెల ప్రారంభంలోని బంగారం గరిష్ట స్థాయి రూ.39,885తో పోలిస్తే ఇప్పుడు పసిడి ధర ఏకంగా రూ.2,000 పడిపోయింది.



ఇక పసిడి ధర తగ్గితే వెండి ధర అదే దారిలో నడిచింది.ఎంసీఎక్స్ మార్కెట్‌లో వెండి ఫ్యూచర్స్ ధర కేజీకి 0.6 శాతం తగ్గుదలతో రూ.47,075కు క్షీణించింది.అయితే వెండి ధర ఈ నెల ప్రారంభంలో రూ.51,489 గరిష్ట స్థాయిని తాకిన విషయం తెలిసిందే. దీంతో పోలిస్తే వెండి ధర ఏకంగా రూ.4,400 పతనమైందన్న మాట.ఇక గ్లోబల్ మార్కెట్‌లో చూస్తే బంగారం,వెండి ధరలు దాదాపు స్థిరంగానే కొనసాగుతున్నాయి.పసిడి ధర ఔన్స్‌కు 1,500 డాలర్లకు పైనే కదలాడుతోంది.అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్ల ప్రకటన కోసం ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నారు.



ఈ రోజు అమెరికా ఫెడ్ పాలసీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించొచ్చనే అంచనాలున్నాయి.ఇక అదేసమయంలో వెండి ధర ఔన్స్‌‌కు 0.4 శాతం క్షీణతతో 17.93 డాలర్లకు తగ్గింది.ఇక భారత్ మార్కెట్ విషయానికి వస్తే బంగారం ధరలు ఈ ఏడాది ఇప్పటి దాకా ఏకంగా 20 శాతం మేర పెరిగాయి.అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి పడిపోవడం ఇందుకు కారణం. ధరల పెరుగుదలతో దేశీయంగా బంగారానికి డిమాండ్ తగ్గింది.ఆగస్ట్ నెలలో బంగారం దిగుమతులు ఏకంగా 60 శాతానికి పైగా తగ్గాయి.త్వరలో దసరా,దీపావళి ఉన్నందున బంగారం ధరలు ఇంకాస్త తగ్గుతే బాగుండునని మధ్యతరగతి ప్రజలు ఆశిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: