ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను మ‌నం హీరోను చేయ‌డం ఏమిటి.. ? అస‌లు రాష్ట్రంలో ఉనికేలేని పార్టీ నిర్వ‌హించిన స మావేశానికి కాంగ్రెస్ నేత‌లు హాజ‌రుకావ‌డం ఏంట‌ని పార్టీ ముఖ్య నేత‌ల‌పై ఏఐసీసీ కార్య‌ద‌ర్శి, మాజీ ఎ మ్మెల్యే సంప‌త్‌కుమార్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. అస‌లు ప‌వ‌న్‌కు తెలంగాణ‌లో యురేనియం త వ్వ‌కాల‌కు సంబంధం ఏంటి..? జ‌న‌సేన బ్యాన‌ర్‌పై నిర్వ‌హించిన స‌మావేశానికి 130 చ‌రిత్ర గ‌ల పార్టీ ప్ర‌ తినిధులుగా మ‌నం వెళ్ల‌డం ఏంట‌ని ఆయ‌న నేత‌ల‌ను నిల‌దీశారు.


అస‌లు విష‌యానికి వ‌స్తే.. యురేనియం త‌వ్వ‌కాల అంశం ఇప్పుడు రాష్ట్ర‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయింది. న‌ల్ల‌మ‌ల‌లో యురేనియం త‌వ్వాల‌కు ఎట్టి ప‌రిస్థితుల్లో అనుమ‌తులు ఇవ్వ‌కూడ‌ద‌ని కాంగ్రెస్‌తోపాటు అన్ని పార్టీలు, ప‌లు ప్ర‌జాసంఘాలు కోరుతున్నాయి. తాజాగా ఇదే అంశంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా అసెంబ్లీలో స్పందించారు. ఎట్టిప‌రిస్థితుల్లోనూ న‌ల్ల‌మ‌ల‌లో యురేనియం తవ్వ‌కాల‌కు అనుమ‌తివ్వ‌మ‌ని, ఒక‌వేళ కేంద్రం క‌నుక మొండిగా వ్య‌వ‌హ‌రిస్తే, అన్నిపార్టీల‌ను క‌లుపుకుని తామే ఉద్య‌మిస్తాన‌ని కూడా స్ప‌ష్టం చేశారు.


ఇదిలా ఉంటే యురేనియం త‌వ్వ‌కాల అంశంపై కాంగ్రెస్ పార్టీ ఓ క‌మిటీని నియ‌మించింది. ఈ క‌మిటీకి చైర్మ‌న్‌గా పార్టీ సీనియ‌ర్ నేత వీ హ‌నుమంత‌రావు ను నియ‌మించింది. వీహెచ్ నేతృత్వంలో య‌రేనియం త‌వ్వ‌కాలకు వ్య‌తిరేఖంగా పోరాడాల‌ని నిర్ణ‌యించింది. ఈక్ర‌మంలోనే  ఇదే అంశంపై జ‌న‌సేన అధినేత పవ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల నిర్వ‌హించిన స‌మావేశానికి కాంగ్రెస్ ముఖ్య నేత‌లు హాజ‌ర‌వ‌డం వివాదాస్ప‌దం అ వుతోంది.  కాంగ్రెస్ నేత‌లు ప‌వ‌న్ ను క‌ల‌వ‌డం కాంగ్రెస్‌లోని ప‌లువురు నేత‌ల‌కు న‌చ్చ‌డంలేదు.


వి.హ‌నుమంత‌రావు లాంటి సీనియ‌ర్ స్వ‌యంగా ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం... ఆ త‌ర్వాత ప‌వ‌న్ మ‌ల్కాజ‌ర్‌గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డికి ఫోన్ చేసి ఆహ్వానించ‌డం లాంటి ప‌రిణామాలు టీ కాంగ్రెస్‌లోనే కొంద‌రికి న‌చ్చలేదు. ప‌వ‌న్‌కు అంత సీన్ లేద‌ని వాళ్లు భావిస్తుండ‌డ‌మే ఇందుకు కార‌ణం.


మరింత సమాచారం తెలుసుకోండి: