కాంగ్రెస్ లో ఇంతే. మళ్ళీ కాంగ్రెస్ నాయకులు కాలర్ లు పట్టుకునే వరకు వెళ్లారు. ఇక యురేనియం ఇష్యూ .. పార్టీలో చిచ్చు పెట్టింది. పీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సభ్యత్వ నమోదు..భవిష్యత్తు కార్యాచరణపై చర్చ జరిగింది. అక్టోబర్ లో సభ్యత్వ నమోదుకు నిర్ణయించారు. అయితే యురేనియం సమస్య మాత్రం పార్టీలో చిచ్చు పెట్టింది. అఖిలపక్ష సమావేశం పై సంపత్ ఫైర్ అయ్యారు.  యురేనియం అంశాన్ని తెర మీదకు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే... యురేనియంకి..పవన్ కళ్యాణ్ కు సంబంధం ఏంటని సంపత్ ప్రశ్నించారు. జాతీయ పార్టీ వెళ్లి జనసేన ఫ్లాగ్ కింద కూర్చోవడం ద్వారా  ఎలాంటి సంకేతాలు పంపారని నిలదీశారు. మన పార్టీ ఎప్పుడు పిలిచినా... పవన్ కళ్యాణ్ వచ్చాడా..? అని ప్రశ్నించారు.  సీనియర్ నాయకులు అంతా వెళ్లి పవన్ కళ్యాణ్ దగ్గర కూర్చోవడం ఏంటని  ఆగ్రహం వ్యక్తం చేశారు.  సంపత్ అభిప్రాయంతో కుంతియా కూడా ఏకీభవించారు. జనసేన అఖిలపక్ష సమావేశానికి  వెళ్లడం తప్పేనన్న ఆయన.. ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ హామీ ఇచ్చారు.   


 కాంగ్రెస్ మీటింగ్ లో రసాభాస చోటు చేసుకుంది. దాసోజు శ్రవణ్... నిరంజన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. బూతు మాటల వరకు వ్యవహారం వెళ్ళింది. ఎన్నికల టైం లో బయటినేతలు రాగానే టికెట్లు ఇస్తారు... జాతీయ స్థాయి పదవులు ఇస్తారని దాసోజు శ్రవణ్ ని ఉద్దేశించి కామెంట్ చేశారు నిరంజన్. కొత్తగా వచ్చి.. పని చేయకుండా ఢిల్లీ స్థాయిలో పదవులు తెచ్చుకుంటారని విమర్శించారు. దీంతో ఆగ్రహించిన శ్రవణ్  తాను పని చేయకుండా పదవి తెచ్చుకున్నానా? అని...కౌంటర్ ఎటాక్ చేశారు. మాట, మాట పెరుగుతుండటంతో.. పార్టీ ముఖ్యులు జోక్యం చేసుకోవడంతో వ్యవహారం సద్దుమణిగింది. గాంధీ జయంతి వేడుకలు... సభ్యత్వ నమోదుపై కార్యాచరణ చేసింది పార్టీ. కానీ సమావేశంలో గొడవలే హైలెట్ అయ్యాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: