ఈ నెల 16వ తేదీన తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, నవ్యంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అతను మృతి చెందిన సమయం నుంచి కోడెల మృతి చెందారన్న దానికంటే కూడా వైసీపీ ప్రభుత్వంపై నిందలు వేయాలన్న తపనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖంలో ప్రజలు చూస్తున్నారు.     


వైసీపీ ప్రభుత్వం పెట్టిన మానసిక క్షోభ వల్లే కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు నాయుడు నీచంగా శవరాజకీయం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ శవరాజకీయం ప్రజలే కాదు ఆ పార్టీ నేత కూడా చూడలేక పోయాడు. అందుకే పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చాడు తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు అన్నపురెడ్డి నర్సిరెడ్డి.     


తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసిన సందర్బంగా నర్సిరెడ్డి మీడియాతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే నర్సిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు కోడెల మరణం గురించి మీడియాలో మాట్లాడిన అసత్య మాటలకు మనస్థాపం చెంది టీడీపీకి రాజీనామా చేస్తున్నానని అయన తెలిపారు. కోడెల గురించి సంతాప మాటలు మాట్లాడాల్సిన పరిస్ధితి పక్కన పెట్టి సవరాజికీయం చేస్తున్నారని దారుణమన్నారు.      


కోడెల మరణానికి కారణం అయన కుటుంబసభ్యులు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని చెయ్యకూడని నీచమైన పనులు అన్ని కొడుకు, కూతురు చేశారని ఈ విషయం అందరికి తెలిసిందే అని అయన అన్నారు. అక్రమంగా సంపాదించిన ఆస్తి విషయంలో కొడుకు, కూతురు గొడవలు పడిన విషయం అందరికి తెలిసిందే అని, ఎన్నో అరాచకాలు చేసిన కుటుంబాన్ని పక్కన చంద్రబాబు చేసే శవరాజకీయాన్ని చూడలేక టీడీపీకి రాజీనామా చేశా అని అయన వ్యాఖ్యానించారు.        

 

మరింత సమాచారం తెలుసుకోండి: