తమ్ముళ్ళకు ఇప్పటికైనా జ్ఞానోదయం అవుతుందా ? డౌటే. ఎందుకంటే తెలుగుదేశం నేతల్లో చాలామంది చంద్రబాబునాయుడు హిప్నోటిజం చేసినట్లు అయిపోతారు. అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య తర్వాతైనా  తమ్మళ్ళలో తెలివి వస్తుందా అన్నది అనుమానంగా మారింది. కోడెల మరణం తర్వాతైనా చంద్రబాబు వాడకం ఏ స్ధాయిలో ఉంటుందో అందరికీ ఇపుడర్ధం అయ్యుంటుంది అందరికీ.

 

అవసరం అయినపుడు చంద్రబాబు నేతలను దగ్గరకు తీయటంలోను, అవసరం తీరిపోయిన తర్వాత బయటకు ఎలా తోసేస్తారనే  విషయంలో  చంద్రబాబుకు మించిన నేత మరొకరు లేరన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది. పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలను చంద్రబాబు పార్టీ ఫిరాయింపులకు ఎలా ప్రోత్సహించారో అందరూ చూసిందే.

 

నిజానికి పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించిన మూల కారకుడు చంద్రబాబు అయితే కోడెల కూడా ఆరోపణలను ఎదుర్కోవాల్సొచ్చింది. సరే ఇలా ఐదేళ్ళ పాటు చేసిన ప్రతీ పనికిమాలిన పనిని కోడెల సమర్ధించేంత పరిస్ధితులను సృష్టించింది చంద్రబాబే. సరే మొత్తానికి ఐదేళ్ళల్లో చంద్రబాబు పాలనకు జనాలే చరమగీతం పాడేశారు.

 

ఎప్పుడైతే టిడిపి ఘోరంగా ఓడిపోయిందో అప్పటి నుండో కోడెలకు కష్టాలు మొదలయ్యాయి. కష్టాల్లో ఉన్న కోడెలను ఆదుకోవాల్సిన చంద్రబాబు వాళ్ళెవరినీ దగ్గరకు రానీయలేదు. కోడెల మరణంలో కేసుల భయం కన్నా చంద్రబాబు దూరంగా పెట్టటం, నేతలెవరినీ  మాట్లాడనీయకుండా కట్టడిచేయటం లాంటివే కోడెలను మానసిక క్షోభకు గురిచేసినట్లు అర్ధమైపోతోంది. ఇదే విషయాన్ని బిజెపి నేతలిద్దరూ స్పష్టంగా చెప్పారు.

 

అవసరమైనపుడు ఎలా వాడుకున్నది ? అవసరం తీరిపోయిన తర్వాత ఎలా వదిలించుకున్నారనేందుకు కోడెల ఉదంతమే నిదర్శనం. కోడెల వ్యవహారంపై పార్టీ నేతల్లోను, కార్యకర్తల్లోను పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వాస్తవాలేంటో అందరికీ తెలిసినా రాజకీయ కారణాలతో ఎవరూ నోరు మొదపటం లేదు. వైసిపి ప్రభుత్వంపై రెచ్చిపోతున్న అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, రామానాయడు, నిమ్మకాయల చినరాజప్ప లాంటి వాళ్ళు చంద్రబాబు గురించి వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: