తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఇక్కడ ప్రభుత్వం ఎన్నో వినూత్న మార్పులు చేర్పులు తీసుకు వస్తున్న విషయం తెలిసిందే.  ఒకప్పుడు పోలీసులు అంటే ప్రజల్లో రక రకాల అభిప్రాయాలు ఉండేవి..కానీ ఇప్పటి ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థ నడుస్తుంది.  ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే స్పందించడం..బాధితుల కష్టాలు వెంటనే తీర్చడం జరుగుతుంది.  ప్రస్తుతం తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీస్ గొప్ప ఫలితాలను ఇస్తుంది..అలాగే మహిళలకు రక్షణగా షీ టీమ్ కూడా ఏర్పాటు చేశారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా..వేధింపులు, లైంగిక దాడులు జరిగినా షీ టీమ్ నింధితుల తాట తీస్తుంది. 


తెలంగాణలో మొట్టమొదటిసారిగా సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఒక సరికొత్త ప్రయోగానికి తెర తీశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ అధికారులందరితో కలిసి స్వయంగా తానే జిల్లా ప్రజలతో ముఖాముఖీ కానున్నారు. జిల్లాలో ఎవరికైనా చట్ట పరమైన సమస్యలు ఉన్నా, ఏవైనా కేసులలో ఇబ్బంది ఎదుర్కొంటున్నా స్వయంగా ఈ మంగళవారం ఈ నెల 24 వ తారీఖున జిల్లా ఎస్పీ కార్యాలయంలో తనను సంప్రదించవచ్చని తెలిపారు. 


ఆ రోజు జిల్లా పొలిసు ఉన్నతాధికారులందరూ ఎస్పీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని, బాధితులకు సంబంధించిన సమస్యను సంబంధిత స్టేషన్ పరిధిలోని ఎస్.ఎచ్.ఓ సమక్షంలో అక్కడికక్కడే పరిష్కారం చేయటానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. 


ఈ మంగళవారం రోజు ప్రతి పోలీస్ స్టేషన్ ఎస్.ఎచ్.ఓ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను, వినతులను స్వీకరించి వాటిని అక్కడిక్కడే పరిష్కరించే ప్రయత్నం చేయటమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి చట్టపరమైన, భద్రతాపరమైన సమస్యలు ఏమైనా ఉంటె ఎటువంటి భయం లేకుండా చెప్పుకోవాలని కోరారు.



మరింత సమాచారం తెలుసుకోండి: