కోడెల మరణం ఆంధ్రప్రదేశ్  లో పెను  విషాదం నింపింది . కోడెల మరణాన్ని టీడీపీ నేతలు అయన అభిమానులు ,సహచరులు జీర్ణించుకోలేకపోతున్నారు . ఎన్నో ఏళ్లుగా టీడీపీ పార్టీ విశేష సేవలందించిన కోడెల మృతి టీడీపీ పార్టీ కి తీరని లోటని పలువురు నేతలు అన్నారు  .ఎన్టీఆర్ హయాంలో టీడీపీ లో చేరిన కోడెల శివప్రసాద్ తిరుగులేని నాయకుడిగా ...తన ప్రస్థానాన్ని కొనసాగించాడు . అటు ఎన్టీఆర్ హయాంలో ...ఇటు చంద్రబాబు హయాంలో ఎన్నో పదవులు చేపట్టి అటు ప్రజలకు ఇటు పార్టీకి ఎనలేని సేవలందించారు కోడెల .  నిన్న మధ్యాహ్నం హైద్రాబాద్ లోని తన నివాసంలో ఆత్మ హత్య చేసుకున్న కోడెలను కుటుంబసభ్యులు గమనించి హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోడెల మరణించాడు . దీంతో ఒక్కసారిగా టీడీపీ లో విషాద చాయాలు అలుముకున్నాయి . .


కోడెల అంత్యక్రియలు అయన సొంతూరైన నరసరావు పేటలో నిర్వహిస్తున్నారు . కాగా అభిమానులు పల్నాడు పులిగా పిలుచుకునే తమ ప్రియతమా నేత ఇకలేరనే విషయాన్నీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు .ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ శోక సంద్రంలో మునిగిపోయారు .కాగా కోడెలపై వీరాభిమాని అయినా గుంటూరులోని డొంకరోడ్డుకి చెందిన మాదినేని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తమ ప్రియతమా నేత కోడెల శివప్రసాద్ రావు ఇక లేరు అనే విషయాన్నీ జీర్ణించుకోలేక పోయారు కోడెల మరణ వార్త విని  గుండెపోటుకు గురై చనిపోయాడు .


నెల్లూరులోని నరసారావు పేటలో కోడెల శివప్రసాద్ రావు అంత్యక్రియలకు అభిమానులు భారీగా తరలి వచ్చారు .నరసారావు పేట స్వర్గపురిలో కోడెల అంత్యక్రియలు జరుగుతాయి  .కోడెల నిర్మించిన స్మశాన వాటికలోనే కోడెల అంత్య క్రియలు జరగనున్నాయి .కాగా కోడెల అంతిమ యాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు , నారా లోకేష్ పాల్గొన్నారు . 


మరింత సమాచారం తెలుసుకోండి: