సంచలన పథకాలు ప్రవేశ పెడుతూ పాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి .ఈ నేపథ్యంలో ప్రజలకి మెరుగైన వైద్యం అందించేందుకు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు .ప్రభుత్వ హాస్పిటల్లో పని చేస్తున్న డాక్టర్స్  ప్రవేట్ ప్రాక్టీస్ చేయకూడదంటూ ఉక్కుపాదం మోపారు . వైద్య, ఆరోగ్య రంగంపై జగన్   నియమించిన సుజాతరావు  కమిటీ సిఫారసులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.సుమారు 100 సూచనలు చేసింది ఈ కమిటీ. కమిటీ  ఇచ్చిన  సిఫారసులపై సీఎం జగన్ విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు .


సిఫారసుల్లో 1000  రూపాయాలకంటే ఎక్కువ ఖర్చు దాటే ప్రతి వ్యాధికి ఆరోగ్య శ్రీ కార్డుతో వైద్యం అందించాలని నిర్ణయించారు . ప్రజలకి మెరుగైన వైద్య  సేవలను  అందించేందుకు చెన్నై , బెంగుళూరు , హైదరాబాద్ నగరాల లోని సుమారు 150  మల్టి స్పెషాలిటీ ఆసుపత్రులకు ఆరోగ్య శ్రీ  వర్తింప చేసేలా ఆదేశాలు జారీ చేశారు .ప్రభుత్వ వైద్యులకు జీతాల పెంపు విషయంలో కూడా సానుకూలంగా స్పందించిన జగన్ మోహన్ రెడ్డి... ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


అంతే కాకుండా ఆరోగ్య శ్రీ జాబితాలో 2000  వ్యాధులను తెస్తూ ప్రతిపాదన సిద్ధం చేయాలని అధికారులకి  ఆదేశించారు.కాగా జనవరి 1  నుండి ఈ ఈ సేవలు ప్రారంభం కానున్నాయి.పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సేవలను ప్రారంభించగనున్నారు .కాగా మిగిలిన జిల్లాల్లో 1200  వ్యాధులకు ఆరోగ్య శ్రీ కార్డు ద్వారా వైద్యం అందించనున్నారు .కాగా మిగతా  జిల్లాలో 2020  లో ఏప్రిల 1  నుండి ఈ పాఠం అమలు జరగనుంది . ఆపరేషన్లు చేయించుకునే వారు కోలుకునే  వరకు  5000 సాయం  అందించేందుకు నిర్ణయించారు .కాగా ఆరోగ్య శ్రీ కార్డులు 
డిసెంబర్ 21  నుండి జారీ చేయనున్నారు .



మరింత సమాచారం తెలుసుకోండి: