తాజాగా టీడీపీ నుంచి వైసీపీ తీర్థంపుచ్చుకున్న రామ‌చంద్ర‌పురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు జ‌గ న్ భారీ ఆఫ‌ర్ ఇచ్చారా? ఆయ‌న త‌న జీవితంలో ఎప్పుడూ ఊహించ‌ని విధంగా జ‌గ‌న్ భారీ హామీ క‌ల్పించా రా? అంటే.. ఔన‌నే అంటున్నాయి వైసీపీ శ్రేణులు. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన తోట‌ను పార్టీలోకి చేర్చు కోవ‌డం ద్వారా తూర్పుగోదావ‌రిలో ప‌ట్టున్న నాయ‌కుడికి త‌న పార్టీ కండువా క‌ప్ప‌డం ద్వారా జ‌గ‌న్ భారీ అం చనాలే వేసుకున్నార‌ని అంటున్నారు. కాపులను త‌న‌వైపు తిప్పుకొనే క్ర‌మంలో టీడీపీ అధినే త చంద్ర‌బాబు  వారికి రిజ‌ర్వేష‌న్ క‌ల్పించే విష‌యంపై అనేక పిల్లిమొగ్గ‌లు వేశారు.


వారికి ప్ర‌త్యేకంగా కార్పొరేష‌న్‌ను ఏర్పాటు చేశారు. నిధులు విరివిగానే క‌ల్పించారు. అయిన‌ప్ప‌టికీ.. కాపుల ప్ర‌ధాన డిమాండ్ మాత్రం ఇప్ప‌టికీ నెర‌వేర‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో కాపులు ఇప్ప‌టికీ.. చంద్ర బాబుపై గుర్రుగానేఉన్నారు. అయితే, రిజ‌ర్వేష‌న్ల విష‌యం త‌న చేతుల్లో లేద‌ని చెబుతూ వ‌చ్చిన జ‌గ‌న్‌.. రిజ‌ర్వేష‌న్ల విష‌యంపై పెద్ద‌గా స్పందించ‌లేదు. అంతేకాదు, చంద్ర‌బాబు కాపుల‌కు క‌ల్పించిన ఈడ‌బ్ల్యూ ఎస్ కోటా నుంచి కూడా వారిని త‌ప్పించారు.


అయిన‌ప్ప‌టికీ పెద్ద‌గా వ్య‌తిరేక‌త రాలేదు. అయితే, కాపుల‌ను ఆక‌ర్షించే క్ర‌మంలో జ‌గ‌న్ వారికి ఈ బ‌డ్జెట్‌లో 2 వేల కోట్లు కేటాయించారు. అన్నివిధాలా ఆదుకుంటామ‌న్నారు. అదేస‌మ‌యంలో కీల‌క నాయ‌కుల‌కు వైసీపీ తీర్థం ఇవ్వాల‌ని నిర్ణ యించుకున్నారు. ముఖ్యంగా తోట త్రిమూర్తులు కాపు సామాజిక వ‌ర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారు. పార్టీల‌కు అతీతంగా ఆయ‌న‌కు మిత్రులు కూడా ఉన్నారు. ఈ క్ర‌మంలో ఇలాంటి నాయ‌కుడు వైసీపీలో ఉంటే మంచిద‌ని భావించిన జ‌గ‌న్‌. ఆయ‌నను ఏరికోరి పార్టీలో చేర్చుకున్నారు. అదేస‌మ‌యంలో తోట‌కు గ‌ట్టి హామీ కూడా ఇచ్చారు.


ప్ర‌స్తుతం భారీ మెజారిటీని కైవ‌సం చేసుకున్న వైసీపీకి త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో సీట్ల సంఖ్య పెర‌గుంది. ఈ నేప‌థ్యంలో రాజ్య‌స‌భ‌కు తోట‌ను పంపిస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌ద‌ర్వారా.. ఇటు డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌కు కూడా మార్గం సుగ‌మం చేయొచ్చ‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని స‌మాచారం. ఇదే క‌నుక జ‌రిగితే.. అటు తోట న‌క్క‌తోక తొక్కిన‌ట్టేన‌ని అంటున్నారు.  మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: