ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకు వరుసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. అసలే 23 సీట్లలో గెలిచిన టీడీపీ...ఓడిపోయిన చాలా నియోజకవర్గాల్లో అడ్రెస్ లో లేదు. కీలక నియోజకవర్గాల్లో ఓడిపోయిన నేతలు బీజేపీ, వైసీపీల్లోకి జంప్ చేసేస్తున్నారు. టీడీపీ ఒక్క సీటు కూడా గెలుచుకొని విజయనగరం, కడప, నెల్లూరు జిల్లాల నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులు పూర్తిగా సైలెంట్ అయిపోయాయి.


ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణం టీడీపీని మరింత షాకుకి గురిచేసింది. ఇప్పటికే కొన్ని జిల్లాలో దెబ్బ తిని ఉన్న టీడీపీకి ఆయన మరణం వల్ల గుంటూరు జిల్లాలో కూడా పెద్ద ఎదురుదెబ్బ తగిలనట్లైంది. ముఖ్యంగా కోడెల మృతి వల్ల నరసారావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ ఖాళీ అయ్యే పరిస్తితి వచ్చింది. కోడెల నరసారావుపేట నుంచి 1983 నుంచి 1999 వరకు అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. అలాగే 2004,2009ల్లో అదే నియోజకవర్గం నుంచి ఓడిపోయారు.


అయితే 2014 పొత్తులో భాగంగా నరసారావుపేటలో బీజేపీ పోటీ చేయడంతో...కోడెల సత్తెనపల్లిలో పోటీ చేసి గెలిచారు. అప్పుడు కోడెల సత్తెనపల్లి ఎమ్మెల్యేగా, నరసారావుపేట ఇన్ చార్జ్ కూడా పని చేశారు. ఇక 2019 ఎన్నికల్లో కోడెల సత్తెనపల్లి నుంచి ఓడిపోగా, నరసారావుపేట నుంచి చదలవాడ అరవింద్ బాబు పోటీ చేసి ఓడిపోయారు. అరవింద్ ఓటమి తర్వాత అడ్రెస్ లేరు. ఇప్పుడు కోడెల మృతితో రెండు నియోజకవర్గాల్లో టీడీపీని నడిపించే నాయకుడు కనపడట్లేదు.


కోడెల కుమారుడు, కుమార్తెలు రాజకీయాల్లో రావడానికి ఆసక్తి చూపడం లేదు. వచ్చిన వాళ్ళకు పార్టీని నడిపించే సామర్ధ్యం లేదు. కోడెల లేని లోటుని పూడ్చలేరు. ఇప్పటికే గుంటూరు జిల్లాలో మాచర్ల, బాపట్ల లాంటి నియోజకవర్గాల్లో టీడీపీ చాపచుట్టేసింది. ఇప్పుడు కోడెల మరణంతో నరసారావుపేట, సత్తెనపల్లిలలో కూడా టీడీపీ ఖాళీ కానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: