చంద్రబాబు నాయుడు.. ఇతని గురించి ఎం చెప్పాలి ? ఎంతని చెప్పాలి. రాజకీయం కోసం ఎంతైనా ఏమైనా చేసే నాయకుడు. ఉమ్మడి రాష్ట్రాన్ని 9 ఏళ్ళు పరిపాలించాడు. నవ్యంద్రను 5 ఏళ్ళు పరిపాలించాడు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా దాదాపు 14 సంవత్సరాలు పైనే పరిపాలించాడు. ముఖ్యమంత్రిగానే అన్నేళ్లు అనుభవం ఉంటె ప్రతిపక్షనేతగా ఇంకెన్నేళ్ళు అనుభవం ఉండాలి. 


10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష నేతగా అనుభవం ఉంది. అన్నేళ్లు అనుభవం అంటే మాములు మాటల. రాజకీయ నాయకులకు ఇది సాధ్యమా ? ఎవరికీ సాధ్యం కాదు. ఇన్నేళ్లు రాజకీయంలో ఉండటం అసలు కాదు. కానీ చంద్రబాబుకి ఈ పని సాధ్యమే. ఎందుకంటే పక్కనే ఉండి శవరాజికీయం చేసి మరి ఓట్లు తెచ్చుకునే శక్తి బాబుకి ఉంది. రాజకీయాలలో ఉండే శక్తి ఆయనకు ఉంది. 


అయితే ఇప్పుడు ఇవి అన్ని ఎందుకు అని అనుకున్నారా ? కారణం కోడెల మరణం. అతని మరణాన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూసినందుకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేస్తుంది. ఆ విమర్శలలో కొన్ని నిజాలు బయటకు వచ్చాయి. భూమా నాగిరెడ్డి, సీనియర్ ఎన్టీఆర్, హరి కృష్ణ, కోడెల శివ ప్రసాద్ లను మానసికంగా వేధించి చంపారని అంటున్నారు కొందరు నేతలు. 


విషయానికి వస్తే.. భూమా నాగిరెడ్డికి మంత్రిపదవి ఇస్తా అని ఆశ చూపి తెలుగు దేశం పార్టీలోకి చేర్చుకొని చివరికి ఇవ్వకుండా అటు వైసీపీకి, ఇటు టీడీపీకి కాకుండా మధ్యలో ఉంది మానసిక వేదనతో నాగిరెడ్డి చనిపోయేలా చేసింది చంద్రబాబు కదా ? అని ఒకరు ప్రశ్నిస్తే.. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి మానసికంగా చంపింది చంద్రబాబు కదా అని ప్రశ్నిస్తున్నారు. 


మొన్నటికి మొన్న సుపుత్రుడు లోకేష్ కి నందమూరి హరికృష్ణ ఎక్కడ అడ్డు వస్తాడోనాని పార్టీ కార్యక్రమాలకు దూరం చేసి, పదవులు ఇవ్వకుండా చనిపోయేవారుకూ మానసికంగా హింసించి, అవమానించి చివరికి శవరాజకీయం చేసి తెలంగాణాలో టీడీపీ తరుపున సుహాసినిని బరిలోకి దించింది చంద్రబాబు అక్కడ అని ప్రశ్నిస్తున్నారు. 


ఇప్పుడు కోడెల మృతితో ఎం చెయ్యాలనుకుంటున్నాడో తెలీదు కానీ.. బతుకున్నంత కాలం బాగా వాడుకొని చివరికి అండగా ఉండాల్సిన సమయంలో ముఖంచాటేసి కనీసం కలవడానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా మానసకింగా హింసించింది చంద్రబాబు కదా అని వైసీపీ నాయకులతో పాటు నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ప్రశ్నలకు చంద్రబాబు ఏం సమాధానం చెప్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: