అధికార పార్టీలో చేరినా మాజీ ఎంఎల్ఏ తోట త్రిమూర్తులుని పాత కేసు వదలటం లేదు. 1996 నుండి తోటను వెంటాడుతున్న శిరోముండనం కేసు ఎప్పటికి ఫైనల్ అవుతుందో ఎవరూ చెప్పలేకున్నారు. నిజానికి టిడిపికి రాజీనామా చేసిన తోట వైసిపిలో చేరటమే శిరోముండనం కేసు నుండి తప్పించుకునేందుకు. కానీ తాజా పరిస్ధితులు చూస్తుంటే రామేశ్వరం పోయిన శనేశ్వరం వదల్లేదనే సామెతలాగ తయారైంది తోట పరిస్ధితి.

 

1996 సంవత్సరం, డిసెంబర్ 29వ తేదీన రామచంద్రాపురం నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో కాపులకు, దళితులకు మధ్య పెద్ద గొడవే అయ్యింది. ఆ గొడవలో కాపు నేతల్లో కొందరు దళితులపై దాడి చేసి బంధీలుగా పట్టుకుని వారికి గుండుకొట్టించారు. అప్పట్లో ఆ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది.

 

ఆ శిరోముండనం కేసులో దళితులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దాంతో పోలీసులు విచారణ చేసి కొందరిపై కేసులు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో తోట త్రిమూర్తులు కూడా ఉన్నారు. అప్పటి నుండి కోర్టులో కేసు విచారణ ముందుకు సాగకుండా అనేక రకాలుగా  అడ్డుకుంటున్నారు. విచారణలో తనకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకే తోట చాలా సార్లు పార్టీలు మారారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే వెంటనే ఆ పార్టీలోకి మారిపోవటం తోటకు చాలా అవసరమైంది.

 

ఇందులో భాగంగానే మొన్నటి వరకూ టిడిపిలో ఉన్న తోట మూడు రోజుల క్రితమే వైసిపిలో చేరారు. రామచంద్రాపురం మండలంలోని ద్రాక్షారామంలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పల్లి సుభాష్ చంద్రబోస్ కు దళితుల సెగ బలంగా తగిలింది. శిరోముండనం కేసులో తోటను శిక్షించాల్సిందే అంటూ దళితులు డిమాండ్ చేశారు. దాంతో పిల్లి మాట్లాడుతూ తప్పుచేసిన తోటకు కచ్చితంగా శిక్ష పడతుందన్నారు. తోట కోసం దళితులను వదులుకునేది లేదని స్పష్టంగా ప్రకటించారు. దాంతో శిరోముండనం కేసు వదిలేట్లు లేదని స్పష్టమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: