అంతర్జాతీయంగా మద్దతు లేకపోయినా.. కశ్మీర్ పై పాకిస్థాన్ కుట్రలు మానడం లేదు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం జరిగే సమయంలో.. కశ్మీర్ లో కల్లోలం రేపాలనేది దాయాది వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు పీఓకే భారత్ దే నన్న విదేశాంగమంత్రి జైశంకర్ వ్యాఖ్యలపై పాక్ మండిపడింది. భారత్ ఉద్రిక్తతల్ని రెచ్చగొడుతోందని ఆరోపించింది.  


పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరుపై భారత దేశం ఇస్తున్న ప్రకటనలు రెచ్చగొట్టేవిధంగా ఉన్నాయని పాకిస్థాన్ ఆరోపించింది. ఇటువంటి వ్యాఖ్యల వల్ల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయని హెచ్చరించింది. పీఓకే ఎప్పటికీ భారత్ దేనని, త్వరలోనే ఆ ప్రాంతంపై సార్వభౌమాధికారాన్ని కూడా సాధిస్తామని విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. 


పాకిస్థాన్‌ను నిందిస్తూ.. అమాయక కశ్మీరీలపై పాల్పడుతున్న నేరాల నుంచి తప్పించుకోలేరని ఆరోపిస్తోంది పాకిస్తాన్.   
భారత దేశ దూకుడును తీవ్రంగా పరిశీలించాలని అంతర్జాతీయ సమాజాన్ని పాకిస్థాన్ కోరింది. భారత్ చేస్తున్న వ్యాఖ్యలు ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని, ఈ ప్రాంతంలో శాంతిభద్రతలను పెను ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని పేర్కొంది. పాకిస్థాన్ శాంతిని కోరుకుంటోందని, అయితే ఎటువంటి దురాక్రమణ చర్యపైన అయినా సమర్థంగా ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపింది. 


ఈ నెల 24 నుంచి 30 వరకు న్యూయార్క్ వేదికగా జరిగే ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా కశ్మీర్‌లో కల్లోలం రేపేందుకు పాక్  కుట్ర రచించినట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్ 23న జరిగే క్లైమేట్ యాక్షన్ సమ్మిట్‌తో యూఎన్‌జీఏ ప్రారంభం కానుంది. దీంతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. మోడీతో పాటు అమెరికా వెళ్లకుండా.. దేశంలోనే ఉండి కశ్మీర్ పై కన్నేయాలని నిర్ణయించుకున్నారు. అయితే దేశ సరిహద్దుల్లో ఉన్న ప్రజలు మాత్రం ఎపుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళనలో ఉన్నారు. మరి భారత సైనికులు వారి పాక్ పన్నాగాలను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. 




మరింత సమాచారం తెలుసుకోండి: