తమిళ హీరోలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు.. ఆ మాట కొస్తే కొన్నేళ్ల క్రితం తమిళ సినిమాలు తెలుగు సినిమా హాళ్లలో తెగ ఆడేవి.. ఒక దశలో తమిళ డబ్బింగ్ సినిమాలను బ్యాన్ చేయాలన్న డిమాండ్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు అంత సీన్ లేదు. కానీ తమిళ హీరోలు చాలామంది తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు.


రజినీకాంత్, కమల్ హాసన్ వంటి సీనియర్లే కాదు. సూర్య, కార్తీ, విశాల్ వంటి హీరోల సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. వీరిలో కొందరు ఏకంగా రెండు భాషలనూ దృష్టిలో ఉంచుకుని సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు తెలుగు తెరకు అంతగా పరిచయం లేని ఓ నటుడు ఏకంగా తెలుగు డైరెక్టు సినిమాలో నటిస్తున్నాడు..


అతడే అధర్వ.. మంచి నటుడుగా పేరున్న ఈ కుర్రాడు.. వాల్మీకి సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ వాల్మీకి చిత్రం ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో హరీశ్ శంకర్ మాట్లాడుతూ అధర్వను ఆకాశానికి ఎత్తేశాడు.. ఈ సినిమా తర్వాత తెలుగులో కూడా అధర్వ బిజీ అవుతాడని చెబుతున్నాడు.


అధర్వ గురించి హరీశ్ ఏమన్నారంటే.. “ వాల్మీకి సినిమాలో వరుణ్ తేజ్ తో పాటు తమిళ నటుడు అధర్వ నటించాడు. ఆయనని తీసుకోవడానికి కారణమేమిటని చాలామంది అడుగుతున్నారు. ఈ సినిమాలో దర్శకుడి పాత్రలో అధర్వ కనిపిస్తాడు. ఈ పాత్రను తెలుగులో ఏ హీరోతో చేయించినా, అంతకుముందు వాళ్లు చేసిన పాత్రలు ఆడియన్స్ కి గుర్తుకువచ్చే అవకాశం వుంది. అందువలన తెలుగులో ఇంతవరకూ చేయని అధర్వని ఆ పాత్ర కోసం ఎంపిక చేసుకున్నాను.


అధర్వ కూడా ఆ పాత్రను చాలా బాగా చేశాడు. తెలుగు భాష నేర్చుకుని డైలాగ్స్ బాగా చెప్పాడు. ఆయన నటనకు మంచి మార్కులు పడతాయి. నాకు తెలిసి ఈ సినిమా తరువాత తెలుగులోనూ అధర్వ బిజీ అవుతాడనే నమ్మకం వుంది" అంటూ అధర్వను ఆకాశానికి ఎత్తేశాడు హరీశ్ శంకర్.


మరింత సమాచారం తెలుసుకోండి: