అబ్బో ఈ కాలం అమ్మాయిలు చాలా ఫాస్ట్ గురూ.. ఇది తరచూ కుర్రాళ్ల మధ్య వినిపించే మాట. దీనికితోడు ఇటీవల బాగా అందుబాటులోకి వచ్చిన స్మార్ట్ ఫోన్.. సోషల్ మీడియా.. ఇంటర్ నెట్ విప్లవం కారణంగా.. అమ్మాయిలకూ, అబ్బాయిలకూ మధ్య సంబంధాలు బాగా పెరిగాయి. దీనికితోడు.. వయసు జోరును మరింత పెంచేలా పోర్న్ కంటెంట్ అరచేతిలోకి వచ్చేసింది.


అందుకే ఇప్పటి కుర్రాళ్లకు కొత్త భయం పట్టుకుంటోందట. అదేంటంటే.. నా కాబోయే భార్య కన్యేనా.. ఆమెకు ఇప్పటికే ఎవరితోనైనా శృంగార అనుభవం ఉందా.. అనేది ఈ ప్రశ్న. తాను ఎంత మంది ఆడాళ్లతోనైనా తిరగొచ్చు. కానీ తన కాబోయే భార్య మాత్రం తనకు మాత్రమే పరిమితం కావాలి. తనను తప్ప వేరే మగాడి గురించి ఆలోచించకూడదు.


ఈ మనస్తత్వం ఇంకా ఈ కాలం కుర్రాళ్లలోనూ ఉందని ఓ పరిశోధనలో తేలింది. ఎందుకంటే.. ఇప్పటి కుర్రాళ్లు బాగా వెదుతుకున్న అంశాల్లో ఈ వర్జిన్ టెస్ట్ టాప్ లో ఉంటోందట. వర్జినిటీ టెస్ట్ ఫర్ విమెన్, వర్జినిటీ టెస్ట్ ఫర్ ఫీమేల్, ఇంట్లోనే వర్జినిటీ టెస్ట్ ఎలా చేయడం ? ఇలాంటి కీ వర్డ్‌లను ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు ఆ పరిశోధనలో తేలింది.


ఈ వివరాల గురించి ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నిస్తే.. వధువు పెళ్లికి ముందు శారీరక సంబంధం పెట్టుకుందో లేదో తెలుసుకునేందుకు ఇలాంటివి చెక్ చేస్తున్నట్లు చెబుతున్నారట. అంతేకాదు.. వధువు వర్జిన్ అయితే అదృష్టవంతులమని అబ్బాయిలు భావిస్తున్నారట. పాత కాలంలో అయితే తొలిరాత్రి అమ్మాయి కన్నెపొర చిరిగి రక్తం వస్తే ఆ వధువు ఫ్రెష్ అని ఫీలయ్యేవారట. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు.


సైక్లింగ్, రన్నింగ్, డ్రైవింగ్ లతో పాటు అనేక క్రీడల్లోనూ అమ్మాయిలు జోరుగా పాల్గొనడం వల్ల పెళ్లికి ముందు ఎలాంటి శృంగార అనుభవం లేకపోయినా కన్నెపొర చిరిగే ఛాన్స్ ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే తమ జీవిత భాగస్వామికి పెళ్లికి ముందు సెక్స్ అనుభవం ఉందో లేదో తెలుసుకోవడం ఎలా అన్న అంశంపై కుర్రాళ్లు గూగుల్ ను జల్లెడ పడుతున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: