ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని చాలామంది బాధపడుతున్నారు.  ప్రకృతిని కాపాడటానికి శతవిధాలా ప్రయత్నం చేస్తుంటారు.  కొంతమంది ఏవో నాలుగు మాటలు చెప్పి పక్కకు తప్పుకుంటారు.   చేయాలనే తపన ఉంటె ఎలాంటి పని అయినా చెయ్యొచ్చు.  ఆ మనకెందుకులే అనుకుంటే ఏ పని చేయలేరు.  ముఖ్యంగా నగరాల్లో నగర విస్తరణ కోసం చెట్లను ఇష్టం వచ్చినట్టుగా నరికేస్తున్నారు.  ఫలితంగా ఎండాకాలం వచ్చింది అంటే వేడి పెరిగిపోతున్నది.  


పైగా వేడి పెరిగిపోతుంటే.. చెట్లను నాశనం చేస్తున్నామని మనం రోడ్డెక్కుతాంగాని, ఆ చెట్లు నాశనం చేయడానికి కారణం మనమే అని తెలుసుకోలేము.  నగరంలో ఉండే ప్రతి ఒక్కరు ఒక్కో చెట్టును నాటితే.. అసలు ఈ సమస్య ఉండదు కదా.  సమస్య రాకపోతే ఎండాకాలం వచ్చినా ఎండా నుంచి ఇబ్బంది ఉండదు కదా.  ఈ విషయాలు ఎందుకని తెలుసుకోవడం లేదో.  తెలిసినా ఎందుకుని అని పక్కన పెడుతున్నారు.  అదే వచ్చిన సమస్య.  


కానీ, ఓ వ్యక్తి మాత్రం వినూత్నంగా ఆలోచించాడు.  చదువులేకున్నా ఆటను పొట్టకూటికోసం ఆటోను నమ్ముకున్నాడు. జీవనం సాగిస్తున్నాడు.  అక్కడితో ఆగకుండా, అందరిలా కాకుండా, తన ఆటో చుట్టూ ఓ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి అందుకో కొన్ని చెట్లు పెట్టాడు.  ఆ చెట్లకు చిన్న వైరింగ్ ద్వారా నీరు అందే ఏర్పాటు చేశాడు.  ఆటో లో వెళ్లే వాళ్లకు లోపల చల్లగా ఉంటుంది.  అంతేకాదు, వివిధ ప్రదేశాల్లో తిరుగుతుంటాడు కాబట్టి.. కొంతమందికి దానివలన కనువిప్పు కలుగుతుంది అన్నది అతని ఉద్దేశ్యం.  


చెట్లను నాశనం చేసి రోడ్లు, ఇల్లు నిర్మించేస్తే.. చెట్లను పెంచాల్సిన స్థలం దొరక్కపోతే.. ఇలా ఆటోలో చెట్లు నాటాల్సి పరిస్థితి వస్తుందని చెప్పడానికి అతను అలా చేసి ఉండొచ్చు.  ఈ ఆటో ఇప్పుడు ముంబైలో అందరిని ఆకట్టుకుంటోంది.  సువాసనలతో కూడిన మొక్కలు కాబట్టి జనాలు ఎక్కుతున్నారు.  ఈ ఆటో ఫోటోను అక్షయ్ కుమార్ షేర్ చేశారు.  అక్షయ్ కుమార్ షేర్ చేయడంతో ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆటో డ్రైవర్ ను అందరు మెచ్చుకుంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: