హిందీ దివస్ రోజున అమిత్ షా చేసిన ఒకే దేశం ఒకే భాష ప్రసంగం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.  దారి తీయడమే కాదు.. మరోసారి భాషా ఉద్యమం దారితీసే పరిస్థితులను కల్పించింది.  ఒకే దేశం ఒకేభాష అంటే కుదరదని, ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలని పెద్ద రగడ జరుగుతున్నది.  హిందీయేతర రాష్ట్రాలు అసలు ఒప్పుకోవడం లేదు.  అటు బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్నాటక కూడా దీనికి ఒప్పుకోలేదు.  ఒకేభాష అంటే కుదరదని, కన్నడ భాష తమకు ముఖ్యం అని చెప్తున్నారు.  


ఇక తమిళప్రజలైతే దీనిపై ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నారు.  వాళ్లకు తమిళభాషపై ఎంతటి మక్కువో చెప్పాల్సిన అవసరం లేదు.  ప్రతితమిళనాడులో ప్రతి బోర్డుపై తమిళం ఉంటుంది.  మిగతా భాషలు కనిపించవు.  ఇటీవల కాలంలో కొంత మార్పులు జరిగాయి.  తమిళంతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషలు కూడా కనిపిస్తున్నాయి.  సామాన్యముల నుంచి నాయకుల వరకు అటు సెలెబ్రిటీలు కూడా భాషోద్యమం చేస్తామని పేర్కొన్నారు.  హిందీభాష అవసరమే కానీ దాన్ని బలవంతంగా మీద రుద్దాలని చూస్తే ఒప్పుకోబోమని హెచ్చరించారు.  


దీనిపై అమిత్ షా వివరణ ఇచ్చారు.  తన వాక్కులను తప్పుగా అర్ధం చేసుకున్నారని, తాను మాట్లాడింది వేరు అని అన్నాడు.  హిందీ భాష వలన ఉపయోగాలు ఉన్నాయి.  హిందీ ప్రతి ఒక్కరికి వచ్చి ఉంటె దేశంలో ఎక్కడైనా సరే మనుగడ సాగించవచ్చు.  ఒకేదెశం ఉన్నప్పుడు ఒకే భాష ఉండటంలో తప్పులేదు.  ముందు రాష్ట్రభాష దానితో పాటు దేశభాష కూడా ఉండాలన్నది తన ఉద్దేశ్యంగా చెప్పాడు.  రెండో భాషగా హిందీని పెట్టాలని కోరారు.  షా ఇచ్చిన వివరణతో కొంతవరకు పరిస్థితులు శాంతిస్తాయని అనుకోవచ్చు.  


తమిళనాడు, కన్నడ, మలయాళీ ప్రజలు దీనిపై పెద్ద రగడ చేస్తున్నారుగాని, మన తెలుగు రాష్ట్రాల నాయకులు దీనిపై పెద్దగా స్పందించలేదు.  కారణం, తెలుగు రాష్ట్రాల్లో తెలుగుతో పాటు హిందీ మాట్లాడే వ్యక్తులు కూడా ఎక్కువుగా ఉన్నారు. ఒకవేళ కేంద్రం చట్టాన్ని తీసుకొచ్చినపుడు చూద్దాంలే అనుకోని ఉండొచ్చు.  భాషా ప్రాముఖ్యత రాష్ట్రాలుగా  ఏర్పడిన తరువాత ఒకే భాష తీసుకురావడం అన్నది కుదరని పని.  కాబట్టి అది జరగదని తెలుసుకాబట్టి ఎందుకు రగడ చేయడం అని సైలెంట్ గా ఉండొచ్చేమో.  


మరింత సమాచారం తెలుసుకోండి: