పాపం పాక్ పరిస్థితి ఇప్పుడు ఎలా మారిపోయిందటే .. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందాన మారిపోయింది.  ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత ఇండియాను అంతర్జాతీయ వేదికలపై దోషిగా చిత్రీకరించాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్నది.  చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.  ఎక్కడ చూసినా ఆ దేశానికీ ఇబ్బందులు కలుగుతున్నాయి.  ఎవరూ కూడా ఆ దేశం చెప్పే మాటలు నమ్మడం లేదు.  పాపం చైనా తప్పించి పాక్ కు దిక్కులేదు.  తనకు మిత్రదేశం అనుకున్న సౌదీ ఇప్పుడు ఇండియాకు సపోర్ట్ చేస్తున్నది.  అటు సౌదీకి శతృదేశం ఇరాన్ కూడా ఇండియాకే సపోర్ట్ చేస్తున్నది.  అరబ్ దేశాలు మొత్తం ఇండియాకు సపోర్ట్ చేస్తున్నాయి. 


అయితే, చైనా అన్ని విషయాల్లోనూ పాక్ కు సపోర్ట్ చేయకపోవచ్చు.  వ్యాపార కాంక్ష కలిగిన దేశం. అది తన అవసరాలుతీరుతున్నంతసేపు ఎలాంటి మాటలు మాట్లాడాడు.  ఒకవేళ పాక్ వలన తనకు ఉపయోగం లేదు లేదంటే.. పాక్ వలన తనకు ముప్పు రావొచ్చు అనే చిన్న కోణం బయటకు వచ్చినా పాక్ ను పక్కన పెడుతుంది.  మరో దేశాన్ని చూసుకుంటుంది.  చైనా ఆదీనంలో ఉన్న హాంకాంగ్ పరిస్థితి ఎలా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు. అక్కడి ప్రజలు స్వాతంత్రం కోసం ఎలా తిరుగుబాటు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం.  


అంతెందుకు నిన్న ఫ్రాన్స్ లో జరిగిన యూరోపియన్ పార్లమెంట్ సమావేశంలో కాశ్మీర్ విషయం చర్చకు వచ్చింది.  సభ్యదేశాల్ని ఇండియాకు మద్దతు ఇచ్చాయి.  పాక్ ను అస్పష్టమైన దేశంగా అభివర్ణించాయి.  దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు పాక్ కు ప్రపంచదేశాలు ఎలాంటి విలువను ఇస్తున్నాయి.  పైగా ఉగ్రవాదులు ఎక్కడినుంచో రావడం లేదని, పాకిస్తాన్ నుంచే వస్తున్నారని ఫ్రాన్స్ అభిప్రాయ పడింది.  ఫ్రాన్స్ లో జరిగిన ఉగ్రదాడుల వెనుక ఉన్నది పాక్ ఉగ్రవాదులే అని స్పష్టం చేసింది.  


ఉగ్రవాదంపై ఇండియాతో కలిసి పోరాటం చేస్తామని ఇప్పటికే ఫ్రాన్స్ స్పష్టం చేసింది. యూరోపియన్ పార్లమెంట్ లోని దేశాలు ఇండియాకు సపోర్ట్ చేయడంతో పాపం పాక్ ఆశలు గల్లంతయ్యాయి.  ఇక మిగిలిన ఐక్యరాజ్య సమితిలో పాక్ తన వాణి వినిపించబోతున్నది.  ముందుగా భారత ప్రధాని మోడీ మాట్లాడతారు.  ఆ మరుసటి రోజున పాక్ ప్రధాని మాట్లాడతారు.  మోడీ ఎలాంటి అంశాలను ఐక్యరాజ్య సమితిలో మాట్లాడతారో చూడాలి.  జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేశమాత్రంగా మోడీ ప్రసంగంలో ఉండొచ్చు.  కాశ్మీర్ విషయంలో మూడో దేశం ప్రస్తావన, పర్యావరణం, ఉగ్రవాదం వంటి వాటిపై మోడీ ప్రసంగం ఉండొచ్చు.  ఏది ఏమైనా పాక్ ఇప్పటికైనా తమ దేశంలోని ఉగ్రమూలాలను తప్పించివేస్తే తప్పించి పాక్ అభివృద్ధి చెందదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: