జొన్నలగడ్డ పద్మావతి.. వైసీపీకి చెందిన యువ ఎమ్మెల్యే.. గత ఎన్నికల్లో శింగనమల నుంచి ఆమె వైసీపీ తరపున గెలిచారు. ఇప్పుడూ ఈ ఎమ్మెల్యే వీడియో ఒకటి చర్చనీయాంశమవుతోంది. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు స్వయంగా తానే ఒక వీడియో చేసి ప్రచారం చేస్తున్నారు.


రోడ్డు ప్రమాదంలో వ్యక్తులు మరణిస్తే ఆ కుటుంబం అంతా రోడ్డున పడుతుంది. కనుక ప్రమాదం జరిగే అవకాశం ఉన్న మలుపులు, కల్వర్టులు, వంతెనలు, రోడ్లు రిపేర్ జరిగే ప్రాంతాలు, క్రాసింగ్ ల వంటి ప్రదేశాలేవైనా ప్రజల ద్రుష్టికి వస్తే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయమంటూ ఆమె ఆ వీడియోలో విజ్ఞప్తి చేసారు. అలాంటి ప్రదేశాలపై తక్షణమే సురక్షితమైన చర్యలు తీసుకుంటామని తెలియజేసారు.


రవాణా అధికారుల బాధ్యతతో పాటు ప్రజలూ సహకరిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు అనే సందేశాన్ని పోస్టు చేసారీ మహిళా ఎమ్మెల్యే. తనకు సంబంధించిన శాఖ కాకపోయినా ప్రజా ప్రయోజనాల కోసం ఎమ్మెల్యే తనకు తానుగా చేసిన ఈ పనిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇలాంటిదిదే మరో విషయం కూడా.. వైసీపీకే చెందిన మరో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కూడా నియోజకవర్గంలో పర్యటించే సమయంలో వీధి స్తంభాల నుంచి మెయిన్ వైర్లు కిందకు ఉండటాన్ని గమనించి సంబంధిత అధికారులను పిలిచి అప్పటికప్పుడే సమస్య పరిష్కరించేలా చేసారు.


ప్రమాదానికి కారమయ్యే అవకాశం ఉండటంతో తక్షణం స్పందించి అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రమాదాలు జరిగాక చింతించడం కాదు ముందే జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే సంబంధిత అధికారులను మందలించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరులో రొట్టెల పండుగ కు వచ్చి.. అక్కడ కట్టిన భారీ ఫ్లెక్సీలను స్వయంగా తొలగించారు. పరిపాలన అంటే కేవలం అధికారులతో పని చేయించడం మాత్రమే కాదు. స్వయంగా జావాబుదారీగా ఉండటమని ఈ ఎమ్మెల్యేలు నిరూపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: