పండుగ సీజన్ మొదలైంది.  మరో కొన్ని రోజుల్లో దసరా సెలవులు రాబోతున్నాయి.  ఈ దసరా సెలవుల్లో ఊర్లకు వెళ్లేందుకు ప్రజలు రెడీ అవుతున్నారు.  ఇప్పటికే బస్సు, ట్రైన్ రిజర్వేషన్లు పూర్తయ్యాయి.  అక్టోబర్ మొదటి వారంలో దేశంలోని బస్, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతాయి.  మరోవైపు ఆలయాలు కూడా కిక్కిరిసిపోతుంటాయి.  వీటిపై ముష్కరులకు కన్నేసినట్టు నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. 


రైల్వే స్టేషన్లు, ఆలయాలను పేల్చివేస్తామని ఉగ్రవాద సంస్థలు పేర్కొన్నట్టు ఐబి తెలియజేసింది.  దీంతో దేశంలోని ప్రముఖ రైల్వే, ఆలయాల దగ్గర బందోబస్త్ ఏర్పాటు చేసింది.  భద్రతను పెంచింది.  ఎక్కడికక్కడ ఈ బందోబస్త్ ను కట్టుదిట్టం చేయడంతో పాటు స్పెషల్ టీమ్ లు అణువణువునా గాలిస్తున్నాయి.  పండుగ సమయంలో క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా రక్షణ వ్యవస్థ పని చేస్తున్నది.  


కాశ్మీర్ ఇష్యూను అంతర్జాతీయం చేయడం కోసం ఉగ్రవాదులను ఇండియాలోకి పంపి అలజడులు సృష్టించేందుకు పాక్ ఎత్తుగడలు వేస్తున్నది.  ఐతే పాక్ ఎత్తులను పసిగట్టి నిఘావర్గాలు ఎప్పటికప్పుడు జాగ్రత్త పరుస్తున్నాయి.  పాక్ ఎత్తులను చిత్తు చేస్తున్నాయి.  ఎంతకాలం ఇలా అన్నది తెలియడం లేదు.  ప్రశాంతంగా ఉండే దేశంలో అలజడులు రేగుతాయని భయపడుతూ బిక్కుబిక్కుమంటు ప్రజలు ఎన్నిరోజులు అవస్థ పడాలి.  


దీనికి శాశ్వత పరిస్కారం లేదా అంటే ఖచ్చితంగా ఉంటుంది.  ఇండియా పీవోకేను తిరిగి స్వాదీనం చేసుకోవడమే దీనికి ఏకైక పరిస్కారం. పీవోకే ను తిరిగి స్వాధీనం చేసుకున్నాక.. పాక్ ఎట్టిపరిస్థితుల్లోనే ఇండియాలోకి ఉగ్రవాదులను పంపే ధైర్యం చేయలేదు.  ఎందుకంటే.. అలా చేయాలని ప్రయత్నిస్తే.. పాక్ ప్రధాన నగరాన్ని ఇండియా బోర్డర్ లోనే ఉంటాయి.. చాలా డేంజర్ అనే విషయం దానికి తెలుసు.  ఏమాత్రం ఇండియాకు హాని తలపెట్టాలని చూసినా.. ప్రధాన నగరాలు ఇబ్బందుల్లో పడిపోతాయి.  కాబట్టి సమస్యకు శాశ్వత పరిస్కారం కావాలంటే... పీవోకే ఇండియాలో విలీనం కావాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: