ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమిపాలైంది.  ఈ ఓటమి తరువాత బాబు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.  పార్టీ కేవలం 23 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.  దీంతో మూడు పార్లమెంట్ నియోజక వర్గాల్లో విజయం సాధించింది.  వైకాపా ఏకంగా 151 స్థానాల్లో విజయం సాధించడంతో.. పాపం బాబుకు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడిపోయాడు. ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాడు.  


అవినీతి ఆరోపణలు చుట్టుముడుతున్నాయి.  గతంలో 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నది.  నోటుకు ఓటు కేసు సమయంలో బాబు తన పాలనా యంత్రాంగాన్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కు షిఫ్ట్ చేశారు.  కెసిఆర్ కు భయపడి బాబు విజయవాడకు మకాం మార్చేశారు అనే అపవాదులు వచ్చాయి.  అయిందేదో అయింది.  ఐదేళ్లు గడిచిపోయాయి.  2019 ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో బాబుకు భంగపాటు పడ్డాడు.  తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన సండ్ర వీరయ్య కూడా కారెక్కేశారు.  


ఇప్పుడు అక్కడ పార్టీలో చెప్పుకోదగ్గ నాయకుడు ఒక్కరు కూడా లేరు.  ఇది తెలుగుదేశం పార్టీకి పెద్దగా క్యాడర్ లేదు.  ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కోలుకోవాలంటే ఇప్పట్లో కుదిరేలా లేదు.  ఎలాగో తెరాస పార్టీ అధికారంలోకి రెండోసారి కూడా వచ్చింది.  ఇప్పటికే పార్టీకి కొంత వ్యతిరేకత ఉన్నది.  దాన్ని బాబు ఎలాగైనా క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నాడు.  కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణాలో ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బీజేపీ బలం పుంజుకోవడానికి రెడీ అయ్యింది.  


తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటికే చాలామంది నేతలు బీజేపీలోకి షిఫ్ట్ అయ్యారు.  వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ బలం పుంజుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది.  అయితే, ఇప్పుడు బాబుగారు కూడా తెలంగాణాపై కన్నేశారు.  ప్రతి వారంలో రెండు రోజులు తెలంగాణపై దృష్టిపెట్టాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రతి శనివారం రోజున బాబు తెలంగాణ పార్టీపై ఫోకస్ చేశారు.  పార్టీలో కొత్తజీవాన్ని తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్నారు.  కొత్త కమిటీలను, కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్స్ ను నియమించాలని చూస్తున్నారు.  అయితే, ఈసారి ఏకంగా ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్స్ ను టీడీపీ నియమించాలని చూస్తోంది.  త్వరలోనే మహానగరంలో ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని చాటుకోవాలని చూస్తోంది.  కొంతమేర ప్రభావం చూపగలిగితే.. తరువాత కాలంలో దాన్ని మరింత బలపరుచుకోవచ్చని టీడీపీ ఆలోచన.  మరి బాబుగారి ఆశలు నెరవేరుతాయా చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: