మోటార్ వెహికల్ చట్టం అమలులోకి వచ్చిన తరువాత జరిమానాలు మోత ఎక్కువండి.  ఈ జరిమానాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఒకటికాదు రెండు కాదు వేలాదిరూపాయలు జరిమానాగా కట్టాల్సి రావడంతో ప్రజలకు దిక్కుతోచడం లేదు.  కట్టకపోతే బండి సీజ్ చేస్తారు.  ఎలాగోలా కడితే.. మరలా ఆ అప్పులు తీర్చాలి.  ఈ కష్ఠాలతో నానా కష్టాలు పడుతున్నారు.  ఒకప్పుడు హెల్మెట్ లేకుంటే వందరూపాయల ఫైన్ ఉండేది. 

కానీ ఇప్పుడు హెల్మెట్ లేకుంటే ఏకంగా వెయ్యిరూపాయలు ఫైన్.  ఫైన్ కట్టే బదులు హెల్మెట్ కొనుక్కుంటే సరిపోతుందని వాహనదారుల అభిప్రాయం.  అందుకే హెల్మెట్ కొనుగోలు చేస్తున్నారు.  ఒకప్పుడు బండిపై వెళ్లే సమయంలో హెల్మెట్ పెట్టుకునే వ్యక్తులు అరుదుగా కనిపించేవారు.  కానీ, ఇప్పుడు అలా కాదు.. హెల్మెట్ లేని వ్యక్తులు కనిపించడం లేదు.  రోడ్డును ఎక్కడపడితే అక్కడ దాటటం వంటివి కూడా చేయడం లేదు.  ఇప్పుడు హెల్మెట్ అన్నది చాలా విలువైన వస్తువుగా మారిపోయింది. 


బండి బయటపెడితే.. బండిని ఎవరూ ముట్టుకోవడం లేదు.  ఎందుకంటే.. బండి గురించి పెద్దగా ఇబ్బంది లేదు.  ఎవరూ కూడా దాన్ని ముట్టుకోవడం లేదు.  అయితే, బండికంటే ఇప్పుడు విలువైన వస్తువు హెల్మెట్.  వాహన చట్టం అమలులోకి వచ్చిన తరువాత హెల్మెట్ వాడకం పెరిగింది.  హెల్మెట్ అమ్మకాలు పెరిగాయి. దీంతో హెల్మెట్ రేట్లు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెంచడం మొదలుపెట్టారు.  


అయితే, కొంతమంది వ్యక్తులు హెల్మెట్ కొనలేక.. వాటిని దొంగతనం చేస్తున్నారు.  చాలా నగరాల్లో హెల్మెట్ దొంగతనం జరుగుతున్నది.  అందుకే దానిని భద్రంగా ఇంట్లో దాచుకుంటుంన్నారట.  బండిపొతే కంప్లైంట్ ఇచ్చి ఎలాగోలా తెచ్చుకోవచ్చు.  కానీ, హెల్మెట్ పొతే కంప్లైంట్ ఇవ్వలేరు. అంతేకాదు.. హెల్మెట్ లేకపోతె ఫైన్ కట్టాలి.  కొనాలంటే చాలా డబ్బు పెట్టాలి.  అందుకే జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు.  సో, బంగారం వంటి విలువైన వస్తువులను ఎలా భద్రంగా దాచుకుంటారో.. హెల్మెట్లను కూడా భద్రంగా దాచుకోవలసిన పరిస్థితి వచ్చింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: