వాస్తవం కన్నా అందంగా ఉండేది కల. మన మనసులోని ఆలోచనలు, కోరికలు కలల రూపంలో వస్తుంటాయి. మన మెదడులోని భావాలను చెప్పటానికి కలలు ప్రయత్నం చేస్తాయి. కొన్నిసార్లు కలలు మన లక్ష్యం ఏంటో చెబుతాయి. ఆలస్యం చేస్తే మనకు వచ్చిన కలల్ని మరిచిపోయే అవకాశం కూడా ఉంది. కొన్నిసార్లు పీడ కలలు వచ్చి భయపెట్టే అవకాశం ఉంది. కన్న కలల్ని మరచిపోకుండా ఉండాలంటే కలల కోసమే డైరీలో కొన్ని పేజీలు కేటాయించటం మంచిది. 
 
చనిపోయినట్లుగా కల వస్తే ఆ కలకు అర్థం  చనిపోతామని కాదు. మన నుండి ఏదో ఒక బంధం విడిపోయే అవకాశం ఉందని లేదా శాశ్వతంగా దూరమయ్యే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి. గాలిలో ఎగురుతున్నట్లు కలలో వస్తే జీవితానికి ఉపయోగపడే ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నామని, మన లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో ఉన్నామని అర్థం చేసుకోవచ్చు. 
 
అక్రమ సంబంధంలో ఉన్నట్లు కలలో వస్తే జీవిత భాగస్వామితో సంతోషంగా లేరని, ఇద్దరి మధ్య కలతలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. ఎవరో తరుమున్నట్లు కల వస్తే జీవితంలోని కష్టాల గురించి మరియు సమస్యల గురించి భయపడుతున్నామని అర్థం చేసుకోవాలి. మంటలు కలలో వస్తే జీవితంలో ఏదో ఒక మార్పు జరగబోతుందని అర్థం చేసుకోవచ్చు. మహిళలకు గర్భం దాల్చినట్లు కల వస్తే జీవితంలో గొప్ప మార్పు జరగబోతుందని అర్థం చేసుకోవచ్చు. 
 
నీళ్లు మన కలలోకి వస్తే మనలోని కల్మషాలు, మలినాలు తొలగిపోవటానికి సూచనగా అర్థం చేసుకోవచ్చు. ఎత్తు నుండి పడిపోతున్నట్లు కలలు వస్తే ఏదో ఒక విషయంలో మనం అనుకున్నది సాధించాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. డబ్బు కలలోకి వస్తే మన ఆలోచనలలో లోపాలు ఉన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. మనకు ఎటువంటి సంబంధం లేని కలలు వస్తే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను సూచిస్తున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. 


 
 



మరింత సమాచారం తెలుసుకోండి: