అమరావతిని ప్రపంచస్ధాయి నగరంగా నిర్మిస్తానంటూ చంద్రబాబునాయుడు చేసిన ప్రకటనలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ప్రపంచస్ధాయి నగరం మాట దేవుడెరుగు చిన్నపాటి వర్షానికే భారీ ఎత్తున కురిసే నిర్మాణాలు మాత్రం చేసేశారు. తాజాగా కురుస్తున్న హై కోర్టు భవనాలే ఇందుకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అమరావతి ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి హై కోర్టు భవనంలో చాలా గదులు వర్షపు నీటితో నిండిపోయింది.

 

గదుల్లో నిండిపోయిన వర్షపు నీటిని తోడి బయటకు పొయ్యలేక సిబ్బంది నానా అవస్తలు పడుతున్నారు. ఒకవైపు నీటిని బయటకు తోసేస్తుంటే మరోవైపు పై కప్పు నుండి గోడల మీదుగా నీరు కురుస్తోంది. దాంతో పై కప్పు, గోడలు, ఫ్లోరింగ్ కూడా పాడయిపోతోంది. నిజానికి నిర్మాణంలో ఉన్నపుడే ఈ భవనం నాణ్యతపై అనేకమందికి అనుమానాలు వచ్చాయి.

 

అయితే అప్పడు అధికారంలో ఉన్నది చంద్రబాబు కదా ? అందుకనే మసిపూసి మారేడుకాయను చేశారు. అప్పట్లోనే ఒకవైపు నిర్మిస్తున్న గోడ కూలిపోవటం, వర్షానికి నిర్మాణదశలోనే కురిసినా ఏదో మేకప్ చేసేసి బ్రహ్మాండంగా కట్టేశామనిపించుకున్నారు. ఇంతోటి తాత్కాలిక భవనానికి కూడా చంద్రబాబు రూ. 150 కోట్లు ఖర్చు చేసేశారు. 150 కోట్ల రూపాయలతో కట్టిన ఇంతటి నాసిరకం నిర్మాణంలో ఏ స్ధాయిలో అవినీతి జరిగిందో అర్ధమైపోతోంది.

 

విచిత్రమేమిటంటే తాము కడుతున్నది హై కోర్టు భవనమని, నాణ్యతలో ఏమైనా తేడా వస్తే అవినీతిలో సాక్ష్యాధారాలతో సహా పట్టుబడతామని కూడా కాంట్రాక్టు సంస్ధ భయపడలేదు. ఏ భవనం అయితే మాకేమిటి ? అన్న పద్దతిలో నాసిరకం నిర్మాణాలను చేసేశారు.

 

అసలు మొదటగా నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయాలను కూడా నాసిరకం నిర్మాణాలతో కట్టారు. వీటికి కూడా వందల కోట్ల రూపాయలు అయినట్లు చెప్పారు. ఇంతోటి నాసిరకం నిర్మాణాలకే చంద్రబాబు వందల కోట్ల రూపాయలు చెల్లించారు. ఏ నిర్మాణం చూసినా, ఏ ప్రాజెక్టు చేపట్టినా, ఏ పథకాన్ని అమలు చేసినా మొత్తం అవినీతి కంపే. అందుకనే జగన్మోహన్ రెడ్డి  విచారణలు, సమీక్షలు చేయిస్తున్నది.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: