Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 24, 2019 | Last Updated 7:27 am IST

Menu &Sections

Search

ఏ ముఖం పెట్టుకుని వెళ్తున్నారు..?

ఏ ముఖం పెట్టుకుని వెళ్తున్నారు..?
ఏ ముఖం పెట్టుకుని వెళ్తున్నారు..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏ ముఖం పెట్టుకుని గవర్నర్‌ దగ్గరకు వెళ్తున్నారని వైస్సార్సీపీ శాసన సభ్యులు అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డిలు చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ఇదే ఈ ప్రశ్నగవర్నర్‌ అడిగితే  ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. గత మూడునెలలుగా మీరు కోడెలను దగ్గరకు రానిచ్చారా అని అడిగారు. అసలు కోడెల ఆత్మహత్యకు ప్రయత్నించారన్న వార్తలు విని ఆయన్ని పరామర్శించడానికి వెళ్లారా అన్నారు. అసెంబ్లీ నుంచి కోడెల కోట్ల రూపాయల ఫర్నిచర్‌ తరలించడం మీకు తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా అని క్వశ్చన్ చేశారు.కోడెల ఫర్నిచర్‌ వ్యవహారంలో, ఆయన అరాచకాలకు గురై తట్టుకోలేక ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తే మీరు ఎందుకు నోరెత్తలేదన్నారు. గత ఐదేళ్లుగా కోడెల కొడుకు, కూతురు కే – ట్యాక్స్‌ వసూలు చేశారా లేదా అని నిలదీశారు. గత ఐదేళ్లుగా కోడెలకు చెందిన ఫార్మా డీల్స్‌ మీకు తెలిసే జరిగాయా? తెలియకుండా జరిగాయా?.గత ఐదేళ్లుగా కోడెల అవినీతి సామ్రాజ్యానికి మీరు వెన్నుదన్నుగా ఉన్నారా? లేదా?.ఇటు సత్తెనపల్లిలోనూ, అటు నర్సరావుపేటలోనూ భూ కబ్జాల మీద మీరు విచారణ ఎందుకు చేయించలేదున్నారు.

 

 

కోడెల తాను చనిపోకముందు మీకు ఫోన్‌ చేసి.. అయ్యా.. ప్రస్తుత ప్రభుత్వం వేధింపులు ఎక్కువగా ఉన్నాయని, మీకు ఎప్పుడైనా చెప్పారా? చెప్తే మీరెందుకు స్పందించలేదు? ఎందుకు మాట్లాడలేదు?. కోడెల తన మరణానికి ఈ ప్రభుత్వ వేధింపులు కారణమని వాంగ్మూలం ఎప్పుడైనా ఇచ్చారా?.  కోడెల చనిపోతూ తన మరణానికి కారణాలు ఇవి, అని ఎక్కడైనా పేర్కొన్నారా?. చంద్రబాబుగారూ.. ఒక మనిషి తీవ్ర అవమానానికి గురైతే ఎన్టీఆర్ మాదిరిగా తల్లిడిల్లిపోతాడా? లేదా? ఈ విషయం మీకు పాతికేళ్ల క్రితమే తెలుసు కదా?.  వేధింపులు అంటే ఎలా ఉంటాయో? వెన్నుపోటు అంటే ఎలా ఉంటుందో మీరే ప్రపంచానికి చెప్పారు కదా? మీరు మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడ్ని మీ సొంతమామని అప్పటి ముఖ్యమంత్రిని కిందికి లాగినప్పుడు ఆయన వేదన గురించి ఏ రోజైనా ఆలోచించారా? ఆయన పార్టీని, పార్టీ అధ్యక్ష పదవిని, పార్టీ జెండాని, పార్టీ ఎన్నికల గుర్తుని? పార్టీ ట్రస్టును? ముఖ్యమంత్రి పదవిని, ఎమ్మెల్యేల్ని, ఎంపీల్ని ఎన్నికలు అయిన ఏడాదికి లాక్కుని ఆయన మరణానికి మీరు కారకులయ్యారని సాక్షాత్తూ ఎన్టీఆర్‌ భార్య ఇవ్వాళ్టికీ సాక్ష్యం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. సాక్షాత్తూ ఎన్టీఆర్‌ కూడా మీ గురించి ఇదే విషయాన్ని చెప్పారు. కాని, ఏనాడూ మీరు ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడ్డం లేదు. 

 

కోడెల శివప్రసాద్‌ హత్యా , లేక ఆత్మహత్యానా. ఆయన  కుటుంబ సభ్యుల పాత్ర ఎంతవరకు ఉందంటారు చంద్రబాబు. అసలు నీ పాత్ర ఏమిటి? అనే అంశాల మీద సీబీఐ విచారణ జరిపించమంటారా అని ప్రశ్నించారు.  కోడెల శివప్రసాద్‌ అధికారాన్ని అడ్డుపెట్టుకుని సత్తెనపల్లి, నర్సరావుపేటల్లో చేసిన అరాచకాలమీద సీబీఐ విచారణ జరపమంటారా?. అసలు సీబీఐని ఈ రాష్ట్రంలోకే  రానివ్వమంటూ మీరు ప్రతిజ్ఞచేసి, జనరల్‌  పర్మిషన్‌ను ఉపసంహరించుకుంటూ జీవోలు కూడా జారీచేశారు కదా. మరి మీకు సీబీఐ మీద నమ్మకం ఎప్పుడు కుదిరింది?. శాంతి భద్రతల విషయంలో జోక్యం చేసుకోవడానికి గవర్నర్ ఎవరని..  ఆయనకు ఏ హక్కు ఉందని జగన్ మోహన్ రెడ్డి పై హత్యాయత్నం జరిగినప్పుడు మాట్లాడిన మీరు.. అసలు గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయమని చెప్పిన మీరు.. ఈరోజు ఏ మొహం పెట్టుకొని గవర్నర్ దగ్గరకు వెళుతున్నారని నిలదీశారు.
 
 
 
 
బీజేపీ నేతలు రఘురాం సహా మరికొందరు చెప్పిన దాని ప్రకారం మీరు చేసిన అవమానాల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం కోడెలే స్వయంగా చెప్పారు. మరి సీబీఐ విచారణ అంటూ జరిగితే ఏ–1 గా హాజరుకావాల్సింది మీరే చంద్రబాబు. అందుకు మీరు సిద్ధమా? ఈ అంశాలన్నింటికీ ప్రజలకు సమాధానం ఇచ్చి ఆతర్వాత గవర్నర్‌ వద్దకు వెళ్తే మర్యాదగా ఉంటుందన్నారు. హంతకుడు తానే హత్య జరిగిందని యాగీ చేసినంత మాత్రాన చేసిన నేరం న్యాయం అయిపోదు.  చివరకు బుధవారం కోడెల శవాన్ని అడ్డుపెట్టుకుని నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆస్పత్రిపై దాడిచేయడానికి పురిగొల్పారని ఆరోపించారు. మరీ ఇంత దిగజారిపోయి మూడురోజులపాటు శవం పక్కనే ఉండి మీ పార్టీని బతికించుకునేందుకు సిగ్గుమాలిన రాజకీయం చేశారు.  బహుశా నిజాలు బయటకు రావన్న నమ్మకంతోనే మీరు ఈ కార్యక్రమాలన్నింటికీ పూనుకున్నారు. కాబట్టి కోడెల శివప్రసాదరావు అరాచకాలమీద, అతని కుటుంబ సభ్యుల అరాచకాలమీద, ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన పరిస్థితుల మీద మొత్తంగా మీ పాత్రమీద సీబీఐ విచారణ కోరండని తామే మీకు సలహా ఇస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఈ ప్రశ్నలపై తగిన సమాధానం చెప్పి తర్వాత గవర్నర్‌ దగ్గరకు వెళ్లమని హితవు చెప్పారు. 
 
 

 

 

Go to the governor with any face
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చట్టసభల కమిటీల కీలకపాత్ర
చంద్రబాబుకిప్పుడు పొగమంచు వీడింది..
అమ్మయ్య బోట్ బయటకి వచ్చింది..
సీఎం జగన్ పై జనసేనాని ఘాటైన విమర్శ
దీపావళి నోములు ఇలా...
23 ,24 వ తేదీల్లో భారీ వర్షాలు
పేదవాడిని చదివిద్దాం..జగన్ ఆకాంక్షను నెరవేరుద్దాం
ఇటు మునిసిపల్ ఎన్నికలు..అటు ఆర్టీసీ సమ్మె: సమాలోచనల్లో కేసీఆర్‌
లోకేష్ ఓ చెల్లని చెక్కు లాంటోడు..
పోలవరంపై అజమాషికి కేంద్ర ఆసక్తి..
గిరిజన ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి మిషన్..
23న దక్షిణకోస్తాంధ్ర మీద అల్పపీడనం..
ఏపీలో కాషాయం దండులోకి పచ్చ తమ్ముళ్లు.
అసలే నష్టాలు.. సమ్మెతో రోజుకి రూ.10 కోట్లు లాస్
చిలికి చిలికి గాలివాన చందంగా ఆర్టీసీ సమ్మె
చట్టం ముందు అందరూ సమానులే.. జగన్‌ స్పష్టీకరణ
స్ఫూర్తిదాయకంగా పోలీసు అమర వీరుల దినోత్సవం
ఆహార మార్పులతో మధుమేహాన్ని తగ్గించుకోవచ్చు...
ఆ రెండు రాష్ట్రాల్లో బిజెపి చేతికి అధికార పగ్గాలు
ఏపీలో కలకలం రేపుతున్న నియామకాల జీఓ
సమ్మెపై గవర్నర్ జోక్యాన్ని కోరిన ఆర్టీసీ జేఏసీ..
సమ్మె కాలమిది..22 న బ్యాంకు ఉద్యోగుల సమ్మె
ఆన్‌లైన్‌లో స్వ‌యంగా ద‌స్తావేజుల త‌యారీపై అవ‌గాహ‌న
నిరుద్యోగులకు తీపికబురు..
ఉనికి కోసమే బిజెపిపైన విమర్శలు..
ఏపీలో పేదలకు జగన్ ఉగాది కానుక..
ఆర్టీసీ సమ్మె: ముమ్మరంగా బంద్ నిరసనలు.. అరెస్టుల పర్వం
హుజుర్ నగర్ ప్రచారపర్వానికి చెక్..!
బంద్ తో కదలని రథచక్రాలు..ప్రత్యమాన్య చర్యల్లో సర్కారు..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.