దేశం యావత్తు నరేంద్రమోడీ జపం చేస్తున్నది. మోడీ గురించి వ్యతిరేకంగా మాట్లాడటానికి జంకుతున్నారు.  ఒకవేళ మోడీ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు.  పార్టీలు సైతం జంకుతున్నాయి.  కానీ ఒకే ఒక్కరు మాత్రం మోడీని విమర్శిస్తున్నారు.  తనకు ఎలాంటి భయం లేదని తేల్చి చెప్తున్నారు.  వారు ఎవరో కాదు.. బెంగాల్ లేడీ టైగర్ మమతా బెనర్జీ. 


ఆమె మాత్రం నరేంద్ర మోడీ రెండు సార్లు ప్రధానిగా బంపర్ మెజారిటీతో గెలిస్తే నాకేంటి నేను ఆయన్ని తిడుతూనే ఉంటానంటూ తన రూటే సెపరేట్ అనేస్తున్నారు.  గత పార్లమెంట్ ఎన్నికల్లో బెంగాల్లో సగం సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది.  వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ చూస్తున్నది.  బెంగాల్లో దూకుడుగా వ్యవహరించేందుకు బీజేపీ సిద్ధం అవుతున్నది.   అయినా సరే మమత వెనకంజ వేయడంలేదు. నరేంద్ర మోడీ విధానాల మీద నా పోరాటం ఎప్పటికీ ఆగదని క్లారిటీగా చెప్పేస్తున్నారు


మోడీపై ఎవరూ చేయని విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నది మమతా.  .దేశంలో ఇపుడు సూపర్ ఎమర్జెన్సీ నడుస్తోందని ఘాటైన మాటలే వాడారు మమతాబెనర్జీ. అందరికి ఎమర్జెన్సీ అంటే ఏంటో తెలుసు.  కానీ, ఈ సూపర్ ఎమర్జెన్సీ అంటే ఏంటో ఎవరికీ అర్ధం కావడం లేదు.  ప్రజాస్వామ్యాన్ని దారుణంగా అవమానిస్తూ దెబ్బతీస్తున్న నరేంద్ర మోడీ దేశానికి ఇస్తున్న సందేశం ఏంటి అని కూడా మమత ప్రశ్నిస్తున్నారు. నరేంద్ర మోడీ మార్క్ పాలనను ఆమె ఎండగడుతున్నారు. దేశంలో మోడీయిజమే ఉండాలా, మరేమీ అక్కరలేదా అంటూ మమత సంధిస్తున్న ప్రశ్నలు బీజేపీ పెద్దాయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.


ఇక మమతా చేస్తున్న వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండిస్తున్నారు.  మోడీపై చేస్తున్న వ్యతిరేక వార్తలు ఇకపై ఎంతో కాలం సాగవని, మరో రెండేళ్లలో బెంగాల్ కోటలో బీజేపీ పాగా వేస్తుందని, బెంగాల్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంటుందని బీజేపీ నేతలు చెప్తున్నారు.  అయితే, మమతా ధైర్యాన్నీ అందరు మెచ్చుకుంటున్నారు.  ఎందుకంటే ఒక మహిళ మోడీ లాంటి చరిష్మా కలిగిన నేతను ఒంటరిగా ఎదుర్కొనడం అంటే మామూలు విషయం కాదు.  చాలా ధైర్యం కావాలి.  అలాంటి ధైర్యం మమతకు ఉన్నది.  ఒకవైపు మోడీపై విమర్శలు చేస్తూనే.. మరోవైపు నిన్న మోడీని కలిసి పుట్టినరోజునాడు కుర్తా, స్వీట్స్ ఇచ్చింది.  అదే కదా మమతా అంటే మరి.  


మరింత సమాచారం తెలుసుకోండి: