భారతదేశంలో బీజేపీ దూసుకుపోతున్నది.  దేశంలోని 28 రాష్ట్రాల్లో పాగా వేయడానికి పావులు కదుపుతున్నది.  1970 ముందు కాలంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వైభవం ఉన్నదో అలాంటి వైభవం ఇప్పుడు బీజేపీకి వచ్చింది.  కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాల కారణంగానే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తున్నది.  పైగా కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ లోపం ఉన్నది.  ఈ లోపం కారణంగానే కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది.  


కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు, బీజేపీ ఎదుగుదలకు చాలా డిఫరెన్స్ ఉన్నది.  బీజేపీ  తనకు తానుగా నిర్వచించుకున్న సిద్దాంతం, జాతీయాభిమానం, క్రమశిక్షణతో కూడిన క్యాడర్ కమలం పార్టీ ఎదుగుదలలో కీలకంగా నిలిచాయి. అయితే గడచిన సార్వత్రిక ఎన్నికల తర్వాత వ్యక్తి కేంద్రంగా పార్టీ మార్పు చెందుతూ వస్తోంది. ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. ఒకే వ్యక్తికింద పనిచేయాల్సి రావడం అనే విధానాన్ని కొందరు తప్పుపడుతున్నారు.  కొందరు దీనికి సపోర్ట్ చేస్తున్నారు.  దేశం అభివృద్ధి ముఖ్యం అని.. ఒకరికింద అధికారం ఉంటుందా లేదంటే ప్రజాస్వామ్యం కింద ఉంటుందా అన్నది వేరే విషయం. 
 

దేశానికి, పార్టీకి కేంద్రీకృత అధికారాలతో కూడిన నాయకత్వం వల్ల ప్రయోజనం ఎంతమేరకు ఉంటుంది? భిన్న మతాలు, సంస్కృతులు, రాజకీయ పక్షాలతో కూడిన ఇండియాలో ఇది మంచి ఫలితాలను ఇస్తుందా? నిరంతరం సంఘర్షణకు దారితీస్తున్న ప్రాంతీయ రాజకీయ విద్వేషాలకు ఇదే పరిష్కారమా? ఇలా అనేక రకాల వాదనలు వినవస్తున్నాయి. ప్రజాభిమానంతో ఒక పార్టీ సమున్నత స్థానానికి వెళ్లడంలో రకరకాల సమీకరణలు కలిసి రావాలి. నాయకత్వం పటిష్ఠంగా ఉండాలి. ఆ పార్టీ సిద్దాంతానికి ఆకర్షితమయ్యే భావోద్వేగాలు కలిసి రావాలి. బీజేపీకి ప్రస్తుతం ఈ రెండు అంశాల్లో ఎదురు లేకుండా పోయింది.


అప్పట్లో దేశంలో ఇందిరాగాంధీకి ఎలాంటి పేరు వచ్చిందో.. అంతకంటే ఎక్కువ పేరు మోడీకి వచ్చింది.  త్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు వంటివి మోడీ చరిష్మాను పెంచాయి.  షా, మోడీలు ఇద్దరు బీజేపీని ముందుకు తీసుకెళ్లేందుకు వేస్తున్న ప్రణాళికలు పార్టీ విజయానికి కారణం అవుతున్నాయి.  13 రాష్ట్రాల్లో సొంతంగా ప్రభుత్వాలు నెలకొల్పుకోవడమే కాకుండా మరో ఆరు రాష్ట్రాల్లో మిత్రపక్షంగా అధికార భాగస్వామిగా నిలిచింది. లోక్ సభలో సొంతంగా మెజార్టీ సాధించింది. రాజ్యసభలోనూ పూర్తి స్థాయి సొంత మెజారిటీకి చేరువైంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత విదేశాల్లో పర్యటిస్తూ.. విదేశాంగ విధానంతో ప్రపంచ దేశాలను దగ్గర చేసుకుంటోంది. పీవోకే విషయంలో కూడా ఇండియా ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుంటుండంతో మోడీ తిరుగులేని నాయకుడిగా ఎదిగాడని చెప్పొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: