ఏపీ మాజీ స్పీకర్ టిడిపి సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు మరణంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను  దుమారం రేగింది. కోడెల మరణం అనంతరం ఆయన మరణానికి వైసీపీ ప్రభుత్వ వేధింపులే కారణమని టిడిపి అంటే... లేదు చంద్రబాబు అవమానించడం వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నాడని వైసిపి అంటూ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నారు. అయితే కోడెల మరణాన్ని శివ రాజకీయంగా మార్చవద్దని  పలువురు అభిప్రాయపడ్డారు. కాగా ఆయన సొంతూరు నరసరావుపేటలో కోడెల అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, టిడిపి అధినేత చంద్రబాబు, టిడిపి నేతలు,  అనుచరులు, అభిమానుల మధ్య పూర్తయ్యాయి. కాగా అనంతపురం జిల్లాలో పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన బిజెపి అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు... కోడెల శివప్రసాద్ రావు మరణంపై స్పందించారు. 


 కోడెల శివప్రసాద్ రావు చాలా ధైర్యం ఉన్న   వ్యక్తి అని... కానీ అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం తనకు   ఆశ్చర్యం కలిగించిందని జీవీఎల్ పేర్కొన్నారు. అయితే కోడెల లాంటి మహానేత మరణంపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు. కాగా కోడెల మరణంపై సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిన  అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై కూడా పలు విమర్శలు చేశారు జీవీఎల్. అమరావతి నిర్మాణం పేరుతో చంద్రబాబు అందరికీ గ్రాఫిక్స్ చూపించారని... కానీ అమరావతిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం రాయలసీమ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించినప్పటికీ... టిడిపి ప్రభుత్వం నిధులను పక్కదారి పట్టించి అభివృద్ధిని విస్మరించిందని మండిపడ్డారు.కేంద్రం విడుదల చేసిన నిధుల వినియోగానికి సంబంధించి కేంద్రం లెక్కలు అడిగితే చంద్రబాబు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజధాని, హై కోర్ట్ నిర్మాణం రాష్ట్ర పరిధిలోని అంశమని... ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని... జగన్ నిర్ణయం మేరకే వాటిని నిర్మించవచ్చు అన్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: