తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్న బీజేపీ ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక స్కెచ్‌ల‌తో ముందుక వెళుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన నేత‌ల‌ను టార్గెట్‌గా చేసుకుని ముందుకు వెళ్లిన బీజేపీ ఇప్పుడు మ‌రో అదిరిపోయే స్ట్రాట‌జీతో ముందుకు వెళుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్త నేత‌ల‌పైనే క‌న్నేసిన బీజేపీ అధిష్టానం ఆ దిశ‌గా కూడా లీకులు ఇస్తూ తెలంగాణ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం రేపుతోంది.


ఇక ఇప్పుడు కేసీఆర్‌పై మ‌రో స‌రికొత్త అస్త్రంతో రెడీ అవుతోంది. అధికార టీఆర్ఎస్‌ను, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ఇరుకున పెట్టేందుకు అనేక వ్యూహాలు ర‌చిస్తోంది. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించి అధికారంలోకి వ‌చ్చారు. ఆయ‌న త‌న ఉద్య‌మం అంతా ఆంధ్రా పాల‌కులు, ఆంధ్రోళ్లు అంటూ టార్గెట్ చేసుకుంటూనే కొన‌సాగించారు. మాట‌మాట‌కు తెలంగాణ‌ను ఆంధ్రా పాల‌కులు దోచుకు తింటున్నార‌ని... ఆంధ్రా వ్యాపారుల‌ను, పెట్టుబ‌డిదారుల‌ను, పాల‌కుల‌ను ఇక్క‌డి నుంచి త‌రిమికొడితే.. తెలంగాణ ప్ర‌జ‌ల బ‌తుకులు బాగుప‌డుతాయ‌న్నప‌దే ప‌దే పిలుపు నిచ్చేవారు.


చివ‌ర‌కు ఈ సెంటిమెంట్ బాగా రాజేయ‌డంలో ఆయ‌న స‌క్సెస్ అవ్వ‌డంతో తెలంగాణ ఉద్య‌మం ఉధృతంగా సాగింది. ప్ర‌త్యేక తెలంగాణ రావ‌డంతో పాటు కేసీఆర్ సీఎం అయ్యారు. ఇక ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింది. ఇప్పుడు కూడా హైదరాబాద్‌లో తెలంగాణ కంటే ఆంధ్రా వాళ్ల హంగామానే ఎక్కువుగా ఉంది. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన కీల‌క ప్రాజెక్టులు కూడా ఆంధ్రాకు చెందిన కంపెనీలే చేస్తున్నాయ‌నే విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. 2018 ఎన్నిక‌ల‌కు ముందు కూడా కేసీఆర్ ఆంధ్రా సెంటిమెంట్ వాడుకుని మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చార‌న్న టాక్ ఉంది.


ఇక ఇప్పుడు బీజేపీ ఇదే అస్త్రం వాడుకుని కేసీఆర్‌కు షాక్ ఇవ్వాల‌ని చూస్తోంది. తాజాగా టీటీడీ బోర్డులో ఏకంగా ఏడుగురు తెలంగాణ వ్య‌క్తుల‌కు చోటు ఇచ్చారు. ఇందులో కేసీఆర్ బంధువులే ముగ్గురు ఉన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రా నీళ్లు తీసుకుని వెళ్లిపోతుంటే, కేసీఆర్ ఎందుకు ? అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇక ఏపీ ప్ర‌భుత్వంతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని... వాళ్ల‌కు చెందిన వ్య‌క్తులకే ఇక్క‌డ కీల‌క ప్రాజెక్టులు క‌ట్ట‌బెడుతున్నార‌ని.. కేసీఆర్ ఆంధ్రోల్ల డైరెక్ష‌న్‌లో పాల‌న చేస్తున్నార‌న్న సెంటిమెంట్‌ను బీజేపీ రెచ్చ‌గొట్టే ప‌నిలో ఉంది. మ‌రి ఈ విష‌యంలో కేసీఆర్ స‌క్సెస్ అయిన‌ట్టు బీజేపీ ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: