ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ, వార్డు సచివాయాల్లో పోస్టుల భర్తీకి సెప్టెంబరు 1 నుంచి 8 వరకు ఆరు రోజులపాటు నిర్వహించిన పరీక్షల ఫలితాలు గురువారం (సెప్టెంబరు 19న) వెల్లడయ్యే అవకాశం ఉంది. సెప్టెంబరు 19న ఫలితాలను వెల్లడించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ గురువారం ఫలితాల వెల్లడి సాధ్యంకాని పక్షంలో శుక్రవారం (సెప్టెంబరు 20) ఫలితాలను వెల్లడించనున్నారు.

అయితే.. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్నవారికి వెయిటేజ్‌ మార్కులు కలిపే అంశానికి సంబంధించి ఇంకా రెండు శాఖల నుంచి సమాచారం అందాల్సి ఉంది.మరోవైపు గాంధీ జయంతి రోజు (అక్టోబరు 2న) రాష్ట్రవ్యాప్తంగా 788 గ్రామ, వార్డు సచివాలయాలను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టనున్నారు.

అక్టోబరు 2 నుంచి రాష్ట్రంలో ప్రారంభంకానున్న మొత్తం 788 సచివాలయాల్లో.. మండలానికి ఒకటి చొప్పున 678 పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఒక్కో వార్డు చొప్పున 110 సచివాలయాలు అందుబాటులోకి రానున్నాయి.గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి మొత్తం 1,28,589 పోస్టులను ప్రభుత్వం భర్తీచేయనున్నారు. వీటిల్లో గ్రామ సచివాలయాల్లో 13 విభాగాలకు సంబంధించి 95,088 పోస్టులు, వార్డు సచివాలయాల్లో 9 విభాగాలకు సంబంధించి 33,501 పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులకు 10 శాతం వెయిటేజి ఇవ్వనున్న సంగతి తెలిసిందే.గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అక్టోబరు 2న విధుల్లో చేరతారు.

నియామకాలు పొందినవారికి రూ.15 వేల స్టైఫండ్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత శాశ్వత పేస్కేలు వర్తింపజేస్తారు. వీరికి రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్‌ అమల్లో ఉంటుంది. వీరికి డీడీఓగా పంచాయతీ సెక్రటరీ వ్యవహరించనున్నారు. పంచాయతీ సెక్రటరీలకే గ్రామ వాలంటీర్లకు వేతనాలు చెల్లించే బాధ్యతను కూడా ప్రభుత్వం అప్పగించింది.ఫలితాలు ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్  భవిష్యత్తు మాత్రం ఏమౌతుందో?


మరింత సమాచారం తెలుసుకోండి: