హుజుర్‌న‌గర్ ఉప ఎన్నిక కాంగ్రెస్‌లో సెగలు రేపుతోంది. ప్ర‌ధానంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని ఆ పార్టీ నేత‌లు పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నారు. తాజాగా హుజూర్‌గర్‌లో నియోజకవర్గ ఉప ఎన్నికల్లో  జోక్యం చేసుకున్నందుకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను యూత్ కాంగ్రెస్ తగలబెట్టింది. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నేత‌లు మాట్లాడుతూ నియోజకవర్గ  కార్యకర్తల అభిష్టం ఒత్తిడి మేరకే పద్మావతిరెడ్డి పోటీ చేస్తారని  ఈ నియోజకవర్గంలో ఏ వ్యక్తి  జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడిగా రేవంత్‌రెడ్డిని గౌరవిస్తాం కానీ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రజల్లో చులకన చేసే విధంగా ప్రకటనలు చేస్తే సహించేది లేదని పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కు అనుకూలంగా ప్ర‌క‌ట‌న‌లు చేశారు.


హుజూర్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిదని ఇక్కడ ఎంత మంది నాయకులు ఎన్ని చెప్పినా ఉత్తమ్‌కుమార్ రెడ్డి నిర్ణయమే శిరోధార్యమని ఇక్కడ పరిస్థితులు తెలుసుకోకుండా రాష్ట్ర నాయకులు వారికి ఇష్టం వచ్చినట్లు పత్రికల్లో ప్రకటనలు చేస్తే హుజూర్‌న‌గర్ కాంగ్రెస్ కార్యకర్తలు సహించబోమని ప్ర‌క‌టించారు. పద్మావతిరెడ్డి ఉప ఎన్నికల్లో నిలబడేందుకు నియోజకవర్గ అ ముఖ్యనాయకులు, కార్యకర్తలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.  పద్మావతిరెడ్డికి నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తతో ప్రజలతో సంవత్సరాల నుండి ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. 


రేవంత్ రెడ్డి గారు హుజూర్‌గర్ నియోజకవర్గ విషయంలో జోక్యం చేసుకోవటం మంచిది కాదని హెచ్చ‌రించారు. పార్టీ నాయకుడిగా రేవంత్‌రెడ్డిని గౌరవిస్తాం కానీ  తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని చులకనగా చేస్తే నియోజకవర్గ కార్యకర్తలు సహించబోమని ఈ సందర్భంగా హెచ్చ‌రించారు. కాగా రేవంత్ వ్యాఖ్య‌లు ఆయ‌న దిష్టిబొమ్మ ద‌హనానికి కార‌ణ‌మ‌య్యాయ‌ని, కాంగ్రెస్‌లో కొత్త చిచ్చును రేపాయ‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: