మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మరణంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. అధికార-విపక్షాలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కోడెల ఆత్మహత్యకు మీరు కారణమంటే.. మీరు కారణమంటూ మాటల తూటాలు పేల్చుకుంటున్నారు.మాజీ స్పీకర్ కోడెల మరణానికి ప్రభుత్వ వేధింపులే కారణమని టీడీపీ ఆరోపిస్తోంది. శివప్రసాదరావుపై కేసులు పేరుతో మానసిక క్షోభకు గురి చేశారని అధినేత చంద్రబాబు ఆరోపించారు.

ఫర్నీచర్ విషయంలో అసెంబ్లీ కార్యదర్శికి లేఖలు రాసినా పట్టించుకోకుండా.. ఆయనపై అక్రమంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. ఈ మేరకు కోడెల అంత్యక్రియలు ముగియడంతో గురువారం గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.ఇవాళ మీడియాతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ"కోడెల మరణానంతరం కూడా ఈ ప్రభుత్వం రాజకీయ కోణంలోనేమాపై లేని పుకార్లు పుట్టిస్తున్నారు.ఈ కేసు దర్యాప్తులోఎటువంటి రాజకీయం చేయకుండా చేస్తేనే తప్ప అసలు నిజాలు బయట పడవు..దేశ రాజకీయాల్లోనే కోడెల ఆత్మహత్య ఒక కేస్ స్టడీ అని..ఈ ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని..ఆయనకు బెయిల్ కూడా రాకుండా చేసేందుకే ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసులు పెట్టి ఆయనను మానసికంగా వేదించారు..ఆయన మరణానికి ఈ ప్రభుత్వమే ప్రధాన కారణం అని చెప్పారు".

ట్విటర్ వేదికగా చెలరేగిన నారా లోకేష్..అధికార దాహంతో, ఆనాడు మహామేత మొదలు పెట్టిన విషపత్రిక ఇప్పటికీ విషం చిమ్ముతూనే ఉంది. శవరాజకీయంలో ఆరితేరిన జగన్ గారి ఆలోచనలకు అనుగుణంగా, దొంగలెక్కల A2 విజయసాయిరెడ్డి గారి సారధ్యంలో నిజాలని కప్పేసి, కోడెల గారిమీద గత 3 నెలలుగా వైకాపా నేతలు ఎలా విషం కక్కారో చూడండి’అంటూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.చంద్రబాబే ప్రధాన కారణం  అంటున్న తలసానిమరోవైపు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చంద్రబాబు నాయుడు పై మండిపడ్డారు.."చంద్రబాబు కోడెలను మానసికంగా ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు తలసాని.

పార్టీ సమావేశాలకు పిలవకుండా.. కోడెలను దూరంగా పెట్టారని.. కోడెలకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. అనారోగ్యంతో ఆయన వారం పాటూ ఆస్పత్రిలో ఉంటే కనీసం పరామర్శించలేదన్నారు. కోడెలపై కేసుల ఆరోపణలు వస్తే కనీసం చంద్రబాబు ఖండించలేదన్నారు."ఎన్ని మాటలు చెప్పినా ఆత్మ హత్య చాలా పిరికిచర్య.

మరింత సమాచారం తెలుసుకోండి: