బండ్లు ఓడ‌ల‌వుతాయి.. ఓడ‌లు బండ్లు అవుతాయి.. అనేది నానుడి.. అంతే కాదు.. ఏది జ‌రిగినా మన మంచికే అంటుంటారు పెద్ద‌లు..  కానీ ఈ నేత విష‌యంలో ఏది జ‌రిగినా మ‌న మంచికే అనే సామెత‌ను ఒంట‌బ‌ట్టించుకుని ముందుకు పోతుండ‌గా,  ముందు చెప్పిన  నానుడి త‌న‌కు మిన‌హ‌యింపు అని నిరూపించుకుంటున్నాడు.. బండ్లు ఓడ‌లైనా.. ఓడ‌లు బండ్లు అయినా.. బేఫీక‌ర్ అంటూ ఏది జ‌రిగినా అది నామంచికే అని ముందుకు సాగుతున్నాడు ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర లేకున్నా మ‌రోసారి చెపుతున్నాం.. ప్ర‌కాశం జిల్లాలో ఓ సాధార‌ణ కార్య‌కర్త నుంచి ఎమ్మెల్యే అయిన వ్య‌క్తి  ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌.


ఆయ‌న పేరు అక్క‌డ చెబితే అప్పుడైనా ఇప్పుడైనా ఒక్క‌టే.. మార్పేమీ లేదు.. ఎదురే లేదు.. ఓడినా గెలిచినా సేమ్ టూ సేమ్‌.. గెలిస్తే నా మంచికే.. ఓడితే అది నామంచికే అని నిరూపించుకుంటున్నాడు ఆమంచి. చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగులేని నేత ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌. మంచి నేత‌గా అంద‌రి మ‌న్న‌న‌లు పొందిన ఆమంచి జ‌డ్పీటీసీగా రాజ‌కీయ జీవితం ప్రారంభించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యాడు. ప్ర‌జ‌లంద‌రికి అందుబాటులో ఉండే ఎమ్మెల్యేగా పేరు గ‌డించాడు.


అయితే గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఆధినేత జ‌గ‌న్ ఆమంచిని ప్ర‌త్యేకంగా పార్టీలోకి ఆహ్వ‌నించారు. జ‌గ‌న్ స‌న్నిహితుడు విజ‌య‌సాయిరెడ్డి భ‌రోసాతో వైసీపీలో చేరిన ఆమంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీచేసి ఓడిపోయాడు. అయినా ఏమాత్రం గ్రాఫ్ త‌గ్గ‌ని ఆమంచికి సీఎం జ‌గ‌న్ ప్ర‌త్యేక స్థాన‌మే కేటాయించార‌ట‌. ఆమంచి టీడీపీలోని ముఖ్య‌నేత‌ల‌ను వైసీపీలో చేర్పించే బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించాడ‌ట‌. అందుకే ఆఫ‌రేష‌న్ ఆమంచి గా వైసీపీలో ఓడినా కింగ్‌గానే త‌న హ‌వా కొన‌సాగిస్తున్నాడు ఆమంచి.


టీడీపీలోని నేత‌లంద‌ర‌ని వ‌రుస‌గా వైసీపీలో చేర్పించే ప‌నిలో నిమ‌గ్న‌మైన ఆమంచికి వైసీపీలో ప్ర‌కాశం జిల్లాలో తిరుగులేని నేత‌గా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఆమంచి చెప్పాడంటే ఆప‌ని కావాల్సిందేన‌ట‌.. అంత ప‌తారా సంపాదించాడ‌ట ఆమంచి.. సో ఆమంచి చెప్పిందే వేధంగా న‌డుస్తున్న‌ప్పుడు ఆయ‌న ఓడితేంది.. గెలిస్తేంది.. వ‌డ్డించేవాడు త‌న‌వాడు అయిన‌ప్పుడు ఆయ‌న‌కేం రందీ..


మరింత సమాచారం తెలుసుకోండి: