కోడెల శివప్రసాద్ మరణానంతరం తెలుగుదేశం పార్టీ మొదటి క్షణం నుంచి అతని చావుని రాజకీయం చేయదలచిన విషయం తెలిసిందే. నిన్నంతా సోషల్ మీడియాలో ట్వీట్లతో మరియు వారి ఛానెళ్లలో వార్తలతో హోరెత్తించిన ప్రతిపక్షం నేడు మరింత మితిమీరి డైరెక్ట్ గా ఒక నివేదికను పట్టుకొని ఏకంగా గవర్నర్ వద్దకు వెళ్ళిపోయారు. కోడెల ఆత్మహత్యకు రాజకీయ వేధింపులే కారణమని గవర్నర్ బిబి హరిచంద్రన్ కు విన్నవించారు. ఆయనపై చిన్న చిన్న కారణాలకు కూడా పెద్ద కేసులు పెట్టి తీవ్ర వేధింపులకు గురి చేసి చివరకు ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఫిర్యాదు చేశారు.

చంద్రబాబుతో పాటు నారా లోకేష్, చినరాజప్ప, దేవినేని ఉమా, బుద్ధ వెంకన్న, కరణం బలరాం, అశోక్ బాబు, కళా వెంకట్రావు, నిమ్మల ఆనందబాబు, వర్ల రామయ్య, రాజేంద్రప్రసాద్ తదితరులు కలిసి వెళ్లారు. ఇలా ఒక పెద్ద బృందమే తెలుగుదేశం పార్టీ నుంచి గవర్నర్ దగ్గరకు 13 పేజీల నివేదిక వెళ్లి సమర్పించి శవాలపై వారు చేసే రాజకీయాలను మరొక ఎత్తుకి తీసుకెళ్లారు. వైసిపిపై వారు ఇచ్చిన నివేదికను పరిశీలించిన తర్వాత జరగాల్సినదానిపై ఆదేశాలు జారీ చేస్తారట. ఒక వ్యక్తి ఆకస్మిక చావుకి సంఘీభావం తెలపడం అనేసి ఇదే ఆసరాగా చేసుకొని అధికార పక్షంపై బురదజల్లడమేమిటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

ఇకపోతే ఆ నివేదికలో వైసీపీ అధికారం చేపట్టిన గత మూడు నెలల కాలంలో జరుగుతున్న దాడులు ఇవే అంటూ గవర్నర్ హరిచంద్ర దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. 13 పేజీల నివేదికలో కోడలు ఆత్మహత్యకి కారణం ప్రభుత్వం వేధింపులు అని మరియు టిడిపి నేతలు-కార్యకర్తలపై అక్రమ కేసుల లిస్టు కూడా పొందుపరిచారు అని తెలుస్తోంది. గవర్నర్ ఆ నివేదికను తక్షణమే తీక్షణంగా పరిశీలించి ప్రతిపక్షంపై దాడులను అరికట్టాలని చంద్రబాబు కోరారట.


మరింత సమాచారం తెలుసుకోండి: