జనసేన పార్టీ అంటేనే పోరాటానికి పెట్టింది పేరు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని పవన్ కళ్యాణ్ ఎప్పుడో స్పష్టం చేశాడు. గత ఎన్నికల్లో ఎటువంటి అడ్డదారులు తొక్కకుండా రూపాయి కూడా పంచకుండా అన్ని స్థానాల్లో పోటీ చేసిన పార్టీగా గొప్ప పేరు తెచ్చుకుంది పవన్ కళ్యాణ్ జనసేన. అయితే మొన్న ఆ పార్టీకి ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి ఊపిరి లాంటి సోషల్ మీడియాలోని కొన్ని ట్విట్టర్ అకౌంట్లు మరియు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ క్లబ్బులు సస్పెన్షన్ కి గురి అయ్యాయి. దీంతో ఒక్కసారిగా పార్టీ శ్రేణుల్లో అలజడి మొదలైంది.

జనసేన పార్టీ సభ్యులు మరియు కార్యకర్తలంతా పెద్ద ఎత్తున సస్పెండ్ అయిన అకౌంట్లు అన్నీ తిరిగి రావాలని ట్విట్టర్లో మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో హ్యాష్ ట్యాగ్స్ ద్వారా ప్రచారం చేశారు. మొన్న ఉదయం నాలుగు అకౌంట్ల సస్పెన్షన్ తో మొదలైనది కాస్తా మధ్యాహ్నం కల్లా 50 అకౌంట్స్ తో మాస్ సస్పెన్షన్ కి చేరింది. ఆ 50 అకౌంట్స్ అన్నీ జనసేన పార్టీకి సంబంధించిన కీలక అప్డేట్లు మరియు వారి భావాలను ప్రజలకు చేరవేసేందుకు కీలకమైనవిగా పార్టీ వారు తెలిపారు. అందులో 'జనసేన శతాగ్ని' అకౌంట్ కూడా ఉండడం గమనార్హం. 

ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారు. ఏ కారణం చేత తమ అకౌంట్లు మాస్ సస్పెన్షన్ కి గురి అయ్యాయో తెలియలేదని... విలువలు పాటిస్తూనే తాము సరైన రీతిలో రాజకీయపరంగా ప్రశ్నిస్తున్నామని... ఇలా ప్రజల తరుపున నిలబడి పోరాటం చేసే వారిపై ఇలాంటి చర్యలు తగదని ఆయన అన్నారు. తర్వాత ఈరోజు సాయంత్రం అనూహ్యంగా సస్పెన్షన్ కు గురైన అకౌంట్లు తిరిగి యాక్టివ్ అయిపోవడంతో జనసేన శ్రేణుల్లో ఆనందం నిండిపోయింది. వారి అకౌంట్లను ఏ కారణాల చేత సస్పెండ్ చేశారో కానీ అన్నీ ఒకేసారి రిలీజ్ చేసి రాజకీయ విలువలను కాపాడారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: