జగన్ పై  అభిమానం కర్ణాటక వరకు పాకింది. అక్కడి ఆర్టీసీ కార్మికులు కూడా జగన్ నిర్ణయానికి   ఫిదా అయిపోయారు. జగన్ లాంటి సీఎం మాకు కావాలని వారు కోరుకుంటున్నారు. జగన్ ఫ్లెక్సీల కు ఏకంగా పాలాభిషేకం చేశారు. జగన్ సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఈ నేపథ్యంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని... ఆర్టీసీ ఉద్యోగులను కూడా రవాణా శాఖ ఉద్యోగులు గా పరిగణలోకి తీసుకొని... ప్రభుత్వం తరఫున వాళ్లకు అందాల్సిన అన్ని సౌకర్యాలను అందిస్తామని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కాగా  ఈ నిర్ణయంతో ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం పొరుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతుంది. ఆంధ్రప్రదేశ్ తరహాలోనే కర్ణాటక ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలని కర్ణాటక ఆర్టీసీ కార్మికులు అక్కడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ నిర్ణయం హర్షణీయం అంటూ హీరే కరూర్ లోని ఆర్టీసీ డిపో సిబ్బంది జగన్ ఫ్లెక్సీలు కు పాలాభిషేకం చేశారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ పరిస్థితి అధ్వానంగా ఉందని... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని లేకపోతే సమ్మె చేపడతామంటూ  తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి కేసీఆర్  ఒత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. కాగా కర్ణాటక ఆర్టీసీ సిబ్బంది జగన్ కు పాలాభిషేకం చేయడం ఆసక్తికరంగా మారింది.

 

 ఇదిలా ఉండగా ఏపీలో నూతన పరిశ్రమలు స్థాపించే వారు స్థానికులకే 75  శాతం ఉద్యోగాలు ఇవ్వాలంటూ జగన్ సర్కార్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ నిర్ణయం పై స్పందించిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు... తమ రాష్ట్రంలో కూడా ఇలాంటి చట్టం తీసుకొస్తామని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: