రక్షక భటులంటే పోలీసులు.వీరు అందిస్తున్నసేవ ఒకరకంగా చెప్పాలంటే చాలా గొప్పది.ఈ పోలీస్ వ్యవస్ధ అనేది లేకుంటే సమాజంలోని పరిస్ధితి ఊహించుకుంటే అసలు నిద్దుర పడుతుందా.ఇంతగా పహరా కాస్తుంటేనే ఎన్నో క్రైంలు జరుగుతు వున్నాయి,అలాంటి వారు అందరు ఒక్కరోజు సెలవుల్లో వుంటే పరిస్ధితి ఏంటి.దేశ సరిహద్దులను ఆర్మి కాపాడుతుంటే, గ్రామ ప్రజలను పోలీస్‌లు కాపాడుతుంటారు.చట్టాన్ని,న్యాయాన్ని రక్షిస్తూ,సాధ్యమైనంత వరకు లా అండ్ ఆర్డర్‌ను కంట్రోల్ చేసేది వీళ్లే.ఇంతగా కష్టపడుతున్న వీరికి సెలవులంటే కొంతవరకు దొరకడం కష్టం.అందుకే ఏపి ప్రభుత్వం వీళ్ల సంక్షేమం కోసం ఏపీలో పోలీస్ సిబ్బందికి ఇప్పటికే వారాంతపు సెలవు ఇస్తున్నారు.వైసీపీ అధికారంలోకి వచ్చాక దీన్ని అమలు చేసారు.



అలాగే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా పోలీస్ సిబ్బందికి వీక్లీ ఆఫ్ ఇవ్వాలని నిర్ణయించింది.కాగా,వారంతపు సెలవు నేటి నుంచి అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు.డీజిపి ఆదేశాల మేరకు ఏసీపీ స్ధాయి అధికారుల నుండి కానిస్టేబుళ్ల వరకు ప్రతి ఒక్కరూ వారాంతపు సెలవును వినియోగించుకునే విధంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు.ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ మాట్లాడుతూ,పోలీసుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని,పోలీస్ డ్యూటీ అంటే ఎంతో స్ట్రెస్ ఉంటుందని అందుకే,స్ట్రెస్ రిలీఫ్ కోసం పోలీసు సోదరులకు కూడా ఆఫ్ ఇవ్వాలని నిర్ణయించా మన్నారు.పోలీసులు మన సోదరులని,మన కోసం పని చేస్తున్నారని,వారు లేకపోతే శాంతి భద్రతలు అదుపు తప్పుతాయని పేర్కొన్నారు.



ఇక వారు ఆరోగ్యంగా ఉంటేనే అందరూ సుఖంగా ఉంటామని,అందుకోసం పోలీసులకు వీక్లీ ఆప్ లేదా 10 రోజులకు ఒకసారి సెలవు ఇవ్వాలని అనుకుంటున్నామని అన్నారు. వీక్లీ ఆఫ్ లేదా 10 రోజులకు ఆఫ్.ఏది ఇవ్వాలి అనే దానిపై పోలీసు ఉన్నతాధికారులు స్టడీ చేస్తున్నారని,త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు.ఇక ఈ సెలవులను జిల్లావ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న సివిల్,ఏఆర్ ఫోర్స్,సిటీ స్పెషల్ బ్రాంచ్,సిటీ క్రైం రికార్డింగ్ బ్రాంచ్, పోలీస్ శిక్షణ కేంద్రంతో పాటు ఇతర విభాగాలకు చెందిన మొత్తం మంది పోలీస్ అధికారులు,పోలీస్ సిబ్బంది వారంతపు సెలవును ఉపయోగించు  కోనున్నారని తెలిపారు...

మరింత సమాచారం తెలుసుకోండి: