ఏది ఏమైనా  పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన పార్టీని  బలోపేతం చెయ్యడానికి తగిన ప్రణాళికలు వేసుకుంటూ  ముందుకు పోతున్నాడు.  జనసేన పార్టీ పై ప్రజల్లో నమ్మకం పెంచడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాడు.  నిజానికి పవన్ పార్టీ ప్రకటించిన రోజున జనసేన పరిస్థితికి... ఈ రోజు జనసేన పరిస్థితికి పెద్దగా  వ్యత్యాసమే లేదు. పైగా ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు.  అయినా పవన్ మాత్రం వెనుక అడుగు వేసే  పరిస్థితి లేదంటున్నాడు. వాస్తవ పరిస్థితులను పరిశీలించి..   రోజురోజుకి ప్రజల్లో  తన పై నమ్మకాన్ని కల్పించాలని ప్రయతిస్తున్నాడట. ఇక నుండి  ముందుచూపు రాజకీయాలు చేస్తూ.. జనసేనను ప్రజల్లో తీసుకువెళ్లే కార్యక్రమాల్లో నిత్యం చేస్తూ ఉంటే..  తనకు ఎప్పటికైనా  రాజకీయ భవిష్యత్తు ఉంటుందని నమ్ముతున్నాడట.  అందుకే ఇప్పటికే ప్లాన్ ప్రకారం పవన్ ప్రజల్లోకి వెళ్ళటానికి నిర్ణయించుకున్నాడు.  ఆంధ్ర ప్రదేశ్ లోని రాజధాని అమరావతికి  భూములిచ్చిన రైతులు, ఆ ప్రాంత ప్రజల్లో నెలకొన్న ఆందోళన, వారి బాధలను తెలుసుకొనేందుకు  పవన్ రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు.  సమీకరణలో భాగంగా నాలుగేళ్ళనాడే భూములు తీసుకున్న ప్రభుత్వం అక్కడ చేపట్టిన పనులు ఏమిటి? వాటి  స్థితిగతులేమిటి అనేది  పరిశీలిస్తాడట.  అలాగే రాష్ట్రంలోని  మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రహదారులు, ప్రభుత్వ భవనాలు, జ్యుడీషియరీ కాంప్లెక్స్ నిర్మాణం, ఎత్తిపోతల పథకం, సి.ఆర్.డి.ఏ. కార్యకలాపాలు ఏ దశలో ఉన్నాయో చూస్తారట. 


మొత్తానికి పవన్ చాలానే ప్లాన్ చేస్తున్నాడట. పనిలో పనిగా  రైతులు, వాటిపై ఆధారపడి బతికిన వ్యవసాయ కూలీలను కూడా కలుస్తారట.  ప్రస్తుతం ఏపీలో   నెలకొన్న పరిస్థితులను స్వయంగా ప్రజలను అడిగి తెలుసుకుంటారట మన పవన్ బాబు. ఇలా  పవన్ కళ్యాణ్ కొత్త రాజకీయం వైపు అడుగులు వేస్తున్నాడు. ఇక నుంచీ ప్రజల్లోనే మేము ఉంటాం అని.. ప్రజల వైపు వెళ్తున్నాడు.   'జ‌న‌సేన పార్టీ ఓట్ల కంటే ఎక్కువ‌గా  ప్ర‌జ‌ల హృద‌యాలు గెలుచుకుంద‌ని' పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపిస్తాడని అభిమానులు సైతం కామెంట్లు పెడుతున్నారు. మరి భవిష్యత్తులోనైనా  ఏపీకి పవన్ సీఎం అవుతారేమో చూడాలి. జనసేనికులు మాత్రం రానున్న ఎన్నికల్లోనే పవన్ కళ్యాణ్ స్టామీనా ఏంటో చూపిస్తామని.. పవన్ ఇలాగే ప్రజల్లోకి వెళ్తే.. ఖచ్చితంగా భవిష్యత్తులో  సీఎం అవడం ఖాయం అని జనసేనికులు ఆశ పడుతున్నారు.         



మరింత సమాచారం తెలుసుకోండి: