శాసనసభ ను ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారా ? అంటే అవుననే టి పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అంటున్నారు . కాళేశ్వరం ద్వారా  నలభైనాలుగు లక్షల ఎకరాలకు నీరు ఎలా ఇస్తారని ఆయన, కేసీఆర్ ను ప్రశ్నించారు. రోజుకు రెండు టీఎంసీల నీళ్లు  ఎత్తిపోస్తే తొంభై రోజులకు నూట నలభై టీఎంసీలు మాత్రమే ఎత్తిపోసే అవకాశమున్న  నేపథ్యంలో నలభైనాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు ఎలా సాధ్యమని నిలదీశారు .


ఇక  నూట నలభై టీఎంసీ నీళ్ల నుంచి ,  హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాల కోసం ముప్పై టీఎంసీలు,  పారిశ్రామిక రంగానికి పదహారు టీఎంసీలు ,   స్థానిక అవసరాలకు పది టీఎంసీలు పోను మిగిలినవి నూట ముప్పై నాలుగు టీఎంసీలతో  నలభై నాలుగు లక్షలు ఎకరాలకు సాగు నీరు  ఎలా అందిస్తారో చెప్పాలని పొన్నాల డిమాండ్ చేశారు . ఇంకో ఇరవై వేల కోట్లు ఖర్చు  పెట్టి, మరో  టీఎంసీ నీటిని ఎత్తిపోసినా,   రెండు వందల డెబ్బై టీఎంసీ లు మాత్రమే అవుతాయని , అయినా  నలభై నాలుగు లక్షలు ఎకరాలకు సాగు నీరు అందించడం అసాధ్యమని పొన్నాల అంటున్నారు .


 ఎనమిదివేల ఐదువందల కోట్లు ఖర్చు పెడితే ముప్పై రెండు లక్షల ఎకరాలకు నీరిచ్చే, ఆన్ గోయింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశమున్నా,   గత అయిదు సంవత్సరాలుగా వాటిని ప్రక్కన పెట్టి ,  కాళేశ్వరం , పాలమూరు ... రంగారెడ్డి ప్రాజెక్టులపై అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్నారు. అయినా ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేని  మీ దోపిడీ లక్ష్యాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆరోపించారు  .  తుమ్మిడిహెట్టి నుండి అదిలాబాద్ ప్రజలకు రెండు లక్షల ఎకరాలకు నీరిచ్చే, ఆనకట్ట ఇప్పటి వరకు మొదలు పెట్టలేదన్న పొన్నాల , ఇది   ఆదిలాబాద్ ప్రజలను మోసం చేయడమే కదా ? అంటూ ప్రశ్నించారు .


మరింత సమాచారం తెలుసుకోండి: