ఇండియాపై పాక్ అక్కసు కక్కుతూనే ఉన్నది.  ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై పాక్ ఇండియా కు వ్యతిరేకంగా మాట్లాడాలని ప్రయత్నించడం.. భంగపడటం షరా మాములే అయ్యింది.  జమ్మూ కాశ్మీర్ విషయంలో ఇండియా ను ఇరకాటంలో పెట్టడానికి చేసిన కృషి అంతాఇంతా కాదు.  కానీ, చేస్తున్న ప్రయత్నాలు ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు.  అన్ని ఫెయిల్ అవుతున్నాయి.  కారణం, ఆ దేశంపై ఎవరికీ నమ్మకం లేకపోవడమే.  


తాజాగా ఐక్యరాజ్య సమితిలో ఇండియాపై కంప్లైంట్ చేసేందుకు సిద్ధమైంది.  కాశ్మీర్ విషయాన్ని మెయిన్ అజెండాగా పెట్టేందుకు పాక్ ప్రయత్నించింది. అయితే, ఐక్యరాజ్య సమితిలో రిజల్యూషన్ పెట్టాలంటే సభ్యదేశాల్లో సంగం దేశాలు అనుమతి ఇవ్వాలి.  కానీ, ఒక్కదేశం కూడా పాక్ పెట్టాలని అనుకున్న కాశ్మీర్ అజెండాను పట్టించుకోలేదు.  జమ్మూ కాశ్మీర్ ఇండియాలోని అంతర్గత విషయం అని దానిపై వేరే జోక్యం అవసరం లేదని ఇప్పటికే ఇండియా స్పష్టం చేసింది.  


కాగా, ఎప్పటికైనా పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఇండియా చెప్తున్నది.  పాక్ లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నట్టు ఇప్పటికే ప్రపంచదేశాలు గుర్తించాయి.  దానికి తగ్గట్టుగా హెచ్చరిస్తున్నాయి. పాక్ మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు.   ఎవరెన్ని అనుకున్నా మాపని మాదే మేము మారం.  అలజడులు సృష్టించడమే మెయిన్ అజెండా అని చెప్తున్నాయి.  ఇందులో భాగంగానే ఇండియాలో అలజడులు సృష్టించేందుకు సిద్ధం అయ్యింది.  


ఐక్యరాజ్య సమితిలో ఇలాగైంటే భంగపడిందో అటు పాకిస్తాన్ దేశంలో కాశ్మీర్ అంశంపై చర్చ జరుగుతుండగా.. ఇండియా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న ఓ నేత కూర్చున్న కుర్చీ వేదిక నుంచి కిందకు జారిపోయింది.  లైవ్ షోలోనే పాపం ఆ నేత కిందపడిపోయాడు.  ఇండియా గురించి తప్పుగా మాట్లాడితే ఎక్కడైనా ఎవరికైనా సరే అదే గతి పడుతుందని ప్రకృతి సింబాలిక్ గా చెప్పినట్టు అయ్యింది. అంతకు ముందు పాక్ రైల్వేమంత్రి మోడీని విమర్శిస్తూ మాట్లాడే సమయంలో షాక్ కొట్టిన సంగతి తెలిసిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: